Home Movie News అల్లు శిరీష్ కష్టాలు….

అల్లు శిరీష్ కష్టాలు….

0
SHARE
ABCD Movie Pre Release Event Photos | telugu.itsmajja.com

అల్లు శిరీష్ నటించిన ఏబిసిడీ… అమెరికన్ బార్న్ కన్ఫ్యూజ్ డ్… దేసి ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దీంతో ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల హడావిడి పెంచేశారు. ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు హీరో నానిని గెస్ట్ గా పిలిచి సందడి చేశారు. ఈ సందర్భంగా చిత్రం ట్రైలర్ ను విడుదల చేశారు. నిజానికి టీజర్ లోనే కాన్పెప్ట్ ని చెప్పేశారు. ట్రైలర్ లో ఇంకాస్త ముందుకు వెళ్లారంతే…ఇంతకూ ట్రైలర్ ఎలా ఉందంటే. .

నిజానికి ఇది కన్నడ రీమేక్ చిత్రం. అక్కడ మంచి చిత్రంగా నిలిచింది. ఈ సినిమా నచ్చి మరీ చేశాడు అల్లు శిరీష్. ఈ సినిమా టీజర్ కంటే కూడా మెల్ల మెల్లగా అంటూ సాగే ఓ పాటను సిడ్ శ్రీరామ్ పాడగా… యూట్యూబ్ లో సెన్సేషనల్ అయ్యింది. దాదాపు 5 మిలియన్ వ్యూస్ తో రికార్డ్ సృష్టించింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. దీనికి ఇండికేషన్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ కూడా ఇంప్రెసివ్ గానే ఉంది. అయితే ఆ మధ్య వచ్చిన గౌతమ్ నంద లోని కొంత పార్ట్ ఈ సినిమాతో లింకప్ అయినట్టు కనిపిస్తోంది. కానీ ఆ సినిమాకు ఈ సినిమాకు సంబంధం లేదంటున్నారు.

ఇక ఇప్పుడు రిలీజ్ చేసిన ట్రైలర్ కు మంచి మార్కులే పడ్డాయి.  కామెడీ విత్ ఎమోషనల్ ట్రైలర్ గా కనిపిస్తోంది. బాగా డబ్బున్న కుర్రాడు… ఇండియాకు వచ్చి డబ్బు లేనివాడిగా బతకడం ఎలాగో ఫన్నీగా చెప్పారు. సంజీవ్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. మధుర శ్రీధర్, యష్ రంగినేని నిర్మాతలు. సురేష్ ప్రొడక్షన్స్ రిలీజ్ చేస్తోంది. రుక్సార్ థిల్లాన్ హీరోయిన్. చైల్డ్ ఆర్టిస్ట్ భరత్ ఫ్రెండ్ క్యారెక్టర్లో నటించాడు. నాగబాబు హీరో తండ్రిగా కనిపించారు. ఇక ఈ సినిమా 17న రిలీజ్ అవుతోంది. అల్లు శిరీష్ ఈ సినిమాపై బాగా నమ్మకం పెట్టుకున్నాడు. మరి ఈ సినిమా ఎవరి లైఫ్ ను ఎలా మార్చుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here