Home Movie News ఇదేం టైటిల్ రా బాబూ….

ఇదేం టైటిల్ రా బాబూ….

0
SHARE
Naga Shaurya | telugu.itsmajja.com
ఏ సినిమా కైనా టైటిల్ చాలా కీలకం. చాలా సినిమాలు టైటిల్ తో ఇంప్రెస్ చేసి హిట్ కొట్టిన సందర్భాలున్నాయి. చాలా సినిమాలు టైటిల్ అనౌన్స్ చేసిన దశనుంచే ట్రోల్ కి గురవ్వడం కూడా చూశాం. అందుకే డైరెక్టర్ కమ్ ఆర్టిస్ట్ శ్రీనివాస్ అవసరాల తన టైటిల్స్ ని విభిన్నంగా తెలుగుదనం ఉట్టిపడేలా అందరూ మెచ్చెలా పెడుతుంటాడు. తాజాగా ఆయన దర్శకత్వంలో రాబోతున్న చిత్రానికి పెట్టిన టైటిల్ తో  జనాలు మాట్లాడుకునేలా  చేస్తున్నాడు. “ఫలానా అబ్బాయి – ఫలానా అమ్మాయి” అనే టైటిల్ పెట్టి ఇంప్రెస్ చేశాడు.
నాగశౌర్య హీరోగా శ్రీనివాస్ అవసరాల గతంలో గుసగుసలాడే అనే సినిమా చేశాడు. ఆ తర్వాత జ్యో అచ్యుతానంద అనే సినిమాను డైరెక్ట్ చేశాడు. ఆ రెండు సినిమాల టైటిల్స్ తో పాటు కంటెంట్ కూడా కొత్తగా ఉంటుంది. ఇక ఇప్పుడు మరోసారి నాగశౌర్య హీరోగా చేస్తున్న సినిమాకు “ఫలానా అబ్బాయి – ఫలానా అమ్మాయి” అనే అచ్చ తెలుగు టైటిల్ పెట్టి ఎట్రాక్ట్ చేశాడు. టైటిల్ కు తగ్గట్టుగానే సినిమా కూడా ఫన్నీగా, ఎమోషనల్ గా, ఫ్యామిలీ మొత్తం చూసే విధంగా ఉంటుందట. రెగ్యులర్ గా అన్ని కుటుంబాల్లో జరిగే లవ్ స్టోరీనే ఎంటర్ టైనింగ్ గా చెప్పబోతున్నాడట.
మాళవికా నాయర్ ఇందులో హీరోయిన్. పీపుల్ మీడియా, దాసరి ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here