Home Movie News బోయపాటి శ్రీనుకు హ్యాండిచ్చిన చిరంజీవి.. కారణం అదేనా..

బోయపాటి శ్రీనుకు హ్యాండిచ్చిన చిరంజీవి.. కారణం అదేనా..

0
SHARE
chiru and boyapati | telugu.itsmajja.com

బోయపాటి, చిరంజీవి సినిమా ఉంటుందని చాలా ఏళ్లుగా ప్రచారం జరుగుతుంది. మెగాస్టార్ కూడా ఈ సినిమాపై క్లారిటీ ఇచ్చాడు. కథ కుదిరితే బోయపాటి శ్రీనుతో 153వ సినిమా చేస్తానని ఇదివరకే చెప్పాడు మెగాస్టార్. గీతా ఆర్ట్స్ నిర్మాణంలో ఈ చిత్రం ఉండబోతుందని క్లారిటీ కూడా వచ్చింది. అశ్వినీ దత్, అల్లు అరవింద్ కలిసి చిరంజీవి సినిమా నిర్మిస్తారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతూనే ఉంది. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

రామ్ చరణ్ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత బోయపాటితో సినిమా చేయడానికి ఆలోచిస్తున్నాడు అల్లు అరవింద్. దానికి తోడు చిరంజీవి కూడా బోయపాటి సినిమాపై పునరాలోచనలో పడ్డారని తెలుస్తోంది. వినయ విధేయ రామ సినిమాలో రామ్ చరణ్ తో విచిత్రమైన ఫిట్స్ అన్ని చేయించాడు బోయపాటి శ్రీను. అవి చూసి సోషల్ మీడియాలో యాంటీ ఫ్యాన్స్ బాగా ట్రోలింగ్ చేశారు. ఇలాంటి సమయంలో బోయపాటితో సినిమా అంటే కాస్త ఆలోచించుకోవాల్సిందే అని సందిగ్ధంలో పడిపోయాడు మెగాస్టార్.

ప్రస్తుతం సైరా సినిమాతో బిజీగా ఉన్నాడు.. ఆ తర్వాత కొరటాల సినిమాతో బిజీగా కానున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత బోయపాటి సినిమాపై ఓ నిర్ణయం తీసుకోన్నాడు చిరంజీవి. ఆ లోపు బాలకృష్ణతో ఒక సినిమా పూర్తి చేసుకుంటాడు బోయపాటి శ్రీను. ఇది కానీ హిట్ అయిందంటే మళ్ళీ చిరంజీవితో బోయపాటి సినిమాను ఊహించుకోవచ్చు.. అలా కాకుండా బాలయ్య సినిమా ఏదైనా తేడా కొట్టింది అంటే చిరంజీవి, బోయపాటి కాంబినేషన్ ను పూర్తిగా మరచి పోవచ్చు. అంటే ఇప్పుడు బాలకృష్ణ సినిమాపైనే చిరంజీవి సినిమా భవిష్యత్తు ఆధారపడి ఉందన్నమాట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here