Home Movie News ఇండస్ట్రీలో అనిల్ రావిపూడి డాడీ ఎవరో తెలుసా..

ఇండస్ట్రీలో అనిల్ రావిపూడి డాడీ ఎవరో తెలుసా..

0
SHARE
Anil Ravipudi | telugu.itsmajja.com

ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కచ్చితంగా ఎవరో ఒకరు గాడ్ ఫాదర్ ఉంటారు. ఎంత బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చినా కూడా వచ్చిన తర్వాత వాళ్లకు అండగా నిలుస్తుంటారు. దర్శకుడు అనిల్ రావిపూడి విషయంలో కూడా ఒకరు ఇలాగే కెరీర్లో తోడుగా ఉన్నారు. అతడే రాజేంద్ర ప్రసాద్. ప్రతి సినిమాలో కూడా ఆయనకు ఒక కీలకమైన పాత్ర ఇస్తుంటాడు అనిల్. ఈ మధ్య కాలంలో రాజేంద్ర ప్రసాద్ చేసిన బెస్ట్ క్యారెక్టర్స్ కూడా అనిల్ రావిపూడి సినిమాలో నుంచి వచ్చినవే. సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్2 సినిమాల్లో కడుపుబ్బ నవ్వించే పాత్రలు ఇచ్చాడు అనిల్ రావిపూడి. ఇక ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు సినిమాలో కూడా రాజేంద్ర ప్రసాద్ కు అద్భుతమైన పాత్ర ఇస్తున్నాడు ఈ కుర్ర దర్శకుడు.

ఇదే విషయాన్ని మీడియా ముందు కన్ఫర్మ్ చేశాడు అనిల్ రావిపూడి. తన ప్రతి సినిమాలో రాజేంద్ర ప్రసాద్ కు అద్భుతమైన పాత్ర ఉంటుందని.. తాను ఇండస్ట్రీలో ఆయనను డాడీ అని పిలుస్తాను అని చెబుతున్నాడు అనిల్. సరిలేరు నీకెవ్వరు లో కూడా మహేష్ బాబు, రాజేంద్రప్రసాద్ మధ్యలో అద్భుతమైన కామెడీ సీన్స్ ఉంటాయని.. చాలా రోజుల తర్వాత మళ్లీ రాజేంద్రప్రసాద్ విశ్వరూపం చూస్తారు అంటున్నాడు ఈ దర్శకుడు. దానికి తోడు మహేష్ బాబు కామెడీ టైమింగ్ కూడా అద్భుతంగా ఉంటుందని.. కచ్చితంగా సరిలేరు నీకెవ్వరు కూడా సంచలన విజయం సాధించడం ఖాయం అంటున్నారు అనిల్ రావిపూడి. దానికి తోడు కలిసొచ్చిన సంక్రాంతి పండక్కి ఈ సినిమాను తీసుకొస్తున్నాడు. దిల్ రాజు, అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో విజయశాంతి కీలక పాత్రలో నటించబోతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here