Home Reviews ఎఫ్2 మూవీ రివ్య

ఎఫ్2 మూవీ రివ్య

0
SHARE

Rating : 3.25./5

వరుససక్సెస్ లతో దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి. పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్ లాంటి హిట్ సినిమాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. ఇప్పుడు ఫన్ అండ్ ఫ్రాస్ట్రేషన్ అంటూ ఎఫ్ 2 తో మనముందుకి వచ్చాడు. కామెడీ ఇరుగదీసే వెంకటేష్ యూత్ హీరో వరుణ్ తేజ్ హీరోలు. తమన్నా మెహ్రీన్ హీరోయిన్లు. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించాడు. దిల్ రాజు నిర్మాత. మరి ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.

కథేంటంటే….

వెంకీ(వెంకటేష్) ఎమ్ఎల్ఏ దగ్గర పీఏ గా పని చేస్తుంటాడు. హారిక ( తమన్నా) సాఫ్ట్ వేర్ ఇంజినీర్. ఇద్దరు మాట్రిమోని ద్వారా పెళ్లి చేసుకుంటారు. పెళ్లి అయిన కొద్దీ రోజులు బాగుంటారు. ఆతర్వాత అసలు కథ మొదలవుతుంది. ఇద్దరి మధ్య ఫ్యామిలీ వార్ జరుగుతుంది. హారిక చెల్లి హాని (మెహ్రీన్) వరుణ్ ( వరుణ్ తేజ్) ప్రేమించుకుంటారు. ఎంగేజ్మెంట్ జరుగుతుంది. అప్పటికే వరుణ్ కి ఫ్రాస్ట్రేషన్ మొదలవుతుంది. పక్కింట్లో వుండే రాజేంద్ర ప్రసాద్ వీరితో కలుస్తారు. వీరు ముగ్గురూ పెళ్లాలకు దూరంగా యూరోప్ వెళ్లి పోతారు. వీరిని వెతుక్కుంటూ తమన్నా మెహ్రీన్ అక్కడికి వస్తారు. వేరే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవుతారు.

అసలు వెంకీ వరుణ్ సమస్య ఏంటి. వారి సమస్య ఎలా సాల్వ్ అయ్యింది. ఎవరి దారిలోకి ఎవరు వచ్చారు. కథ ఎలా ముగిసింది అనేది తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే.

సమీక్ష

సినిమా ప్రారంభం నుంచే నవ్వించడమే టార్గెట్ గా అనిల్ రావిపూడి సినిమా రూపొందించాడు. శంకర్ సంక్రాంతి అల్లుళ్ళ కామెడీ బాగా ఎంజాయ్ చేస్తాం. ముఖ్యంగా వెంకీ కామెడీ ఇరగదీసాడు. ఆయన నుంచి ఆశించే కామెడీ ఫుల్లుగా వండి పెట్టాడు దర్శకుడు. అనిల్ రాసిన కామెడీ కి వెంకీ పూర్తి న్యాయం చేశాడు. వరుణ్ కూడా ఏం తగ్గలేదు. తనదైన తెలంగాణ యాసలో కామెడీ చేసాడు.  వెంకీ, పెళ్లి తర్వాత వచ్చే ఫ్రస్ట్రేషన్ పీక్స్ లో ఉంటుంది. వరుణ్ తో వచ్చే సన్నివేశాల్లో కూడా కామెడీ బాగా వర్కౌట్ అయ్యింది. హీరోయిన్లు తమన్నా, మెహ్రీన్ కూడా టైమింగ్ ని అందుకున్నారు. హీరోలతోపాటు పోటీ పడ్డారు. క్లైమాక్స్ వరకు నవ్వించడమే పనిగా పెట్టుకొని సక్సెస్ అయ్యారు.

సెకండ్ హాఫ్ కాస్త డల్ గా అనిపించినా అప్పటికే పైసా వసూల్ సినిమాగా నిలిచింది. భర్తలను ఇబ్బందులకు గురిచేసే భార్యల కథే ఇది. పెళ్లి అయిన ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యే సన్నివేశాలు ఉన్నాయి. ఆ కామెడీ ని అందరూ ఎంజాయ్ చేస్తారు. సమస్య ను సృష్టించే పాత్రలో రాజేంద్రప్రసాద్ కనిపించాడు. ముఖ్యంగా హరితేజ తో వచ్చే సన్నివేశాలు బాగా నవ్వుతారు. నాజర్, ప్రకాష్ రాజ్ ఆయన సుబ్బరాజు సత్యం రాజేష్ ఇంపార్టెంట్ పాత్రలు పోషించారు. అన్నపూర్ణ శ్రీలక్ష్మి కామెడీ కి నవ్వకుండా ఉండలేం.

అనిల్ రావిపూడి తన మార్క్ కామెడి తో ఆకట్టుకున్నాడు. తన కామెడీ పెన్ పవర్ చూపించాడు. ఈ సినిమాతో డైరెక్టర్ గా ఓ మెట్టు ఎదిగాడు. ప్రేక్షకులకు ఎలా ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలో బాగా తెలుసుకున్నాడు. దాన్ని బట్టే కథలు రాసుకుంటున్నాడు. దాన్ని బట్టి సన్నివేశాలు రూపొందిస్తున్నారు. దీంతో సక్సెస్ సాధిస్తున్నారు. డైలాగ్స్ విషయంలో మరోసారి తన టాలెంట్ చూపించాడు.

ఫైనల్ గా…. 
కామెడీ సినిమాలు ఇష్టపడని వాళ్ళు వుండరు. సో ఎఫ్ 2 చిత్రం లో కావాల్సినంత కామెడీ వుంది. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయదగ్గ కామెడీ ఉంది. సో హ్యాపీగా ఫ్యామిలీ తో కలిసి సంక్రాంతికి ఎంజాయ్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here