Home Movie News తొలిరోజు సంచలనం సృష్టించిన యాత్ర.. కలెక్షన్లు అదుర్స్..

తొలిరోజు సంచలనం సృష్టించిన యాత్ర.. కలెక్షన్లు అదుర్స్..

0
SHARE
yatra movie | telugu.itsmajja.com

మమ్ముట్టి హీరోగా మహీ రాఘవ తెరకెక్కించిన చిత్రం యాత్ర. వైఎస్ఆర్ పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. వైయస్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎమోషనల్ కంటెంట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు అన్ని వర్గాల నుండి పాజిటివ్ టాక్ వచ్చింది.. దర్శకుడు కూడా ఈ చిత్ర విజయంపై ట్వీట్ చేశాడు. ప్రేక్షకులు ఇంతగా ఆదరిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు మహీ రాఘవ.

కేవలం పాదయాత్రనే కాకుండా ఆ పాదయాత్ర చేయడానికి గల కారణాలు.. వైయస్ హయాంలో వచ్చిన ప్రభుత్వ సంక్షేమ పథకాల వెనుక ఉన్న కథలు.. అన్నీ అద్భుతంగా మనసుకు హత్తుకునేలా తెరకెక్కించడంతో యాత్ర సినిమాకు ఇప్పుడు మంచి టాక్ తో పాటు కలెక్షన్లు కూడా వస్తున్నాయి. తొలిరోజు ఈ చిత్రానికి ఏకంగా నాలుగు కోట్లు వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే యాత్ర సినిమా పంట పండినట్లే.

ఎందుకంటే ఈ సినిమాపై ఉన్న అంచనాలు నాలుగు కోట్లు వసూళ్లు అంటే చిన్న విషయం కాదు. దానికి తోడు మన హీరో కాదు.. అయినా కూడా ప్రేక్షకులు వైఎస్ఆర్ బయోపిక్ అని ఒకే ఒక్క కారణంతో యాత్ర సినిమాని పెట్టుకున్నారు. ఇప్పుడు ఇది కంటిన్యూ అయింది అంటే వీకెండ్ ముగిసేలోపు యాత్ర సినిమా చాలా చోట్ల లాభాల్లోకి రావడం ఖాయం. ఓవర్సీస్లో కూడా ఈ చిత్రం మంచి వసూళ్లు సాధిస్తోంది. మొత్తానికి 13 కోట్లు వస్తే యాత్ర హిట్ అయినట్లే. ఇప్పుడున్న టాక్ బట్టి చూస్తే 13 కోట్లు రావడం పెద్ద కష్టమేం కాదనిపిస్తుంది. మరి చూడాలిక చివరి వరకు ఏం జరుగుతుందో.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here