Home Reviews హిప్పీ మూవీ రివ్యూ

హిప్పీ మూవీ రివ్యూ

0
SHARE
Hippi Movie Review | telugu.itsmajja.com

RATING : 2/5

ఆర్.ఎక్స్.100 సినిమాతో సంచలన విజయం ఆందుకున్నాడు కార్తికేయ. ఆ తర్వాత ఎలాంటి సినిమా చేస్తాడా అని ఎదురుచూశారంతా. కానీ వెరైటీగా హిప్పీ అనే అర్థంకానీ టైటిల్ తో  ఓ సినిమా ఎనౌన్స్ చేశారు. దర్శకుడు ఫ్రం తమిళ్, ప్రొడ్యూసర్ ఫ్రం తమిళ్. సినిమా టీం అంతా తమిళ్. కథ అద్భుతంగా ఉంది కాబట్టే తమిళ దర్శకుడి సినిమా ఒప్పుకున్నట్టు చెప్పాడు. ఈ చిత్ర ట్రైలర్స్ కాస్త ఇంట్రస్టింగ్ గానే అనిపించినప్పటికీ… మాస్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్న కార్తికేయ అల్ట్రా స్టైలిష్ క్యారెక్టర్లో ఎలా కనిపించాడు… ఈ క్యారెక్టర్ తో సినిమా నిలబడిందా లేదా అన్నది చూద్దాం.

కథేంటంటే…

హిప్పీ దేవ‌దాస్ అలియాస్ దేవ (కార్తికేయ‌) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌. ఎప్పుడు ఏద‌నిపిస్తే అది చేస్తూ, స్నేహితుల‌తో క‌లిసి స‌ర‌దాగా గ‌డిపే ర‌కం. ఆముక్త మాల్యద (దిగంగ‌న సూర్యవంశీ)తో క‌లిసి స‌హ‌జీవ‌నం చేస్తుంటాడు. స్నేహ (జ‌జ్బాసింగ్‌) త‌న‌ని ప్రేమిస్తున్నా, ఆమెను కాద‌ని వెంటప‌డి మ‌రీ ఆముక్త మాల్యద మ‌న‌సు గెలుచుకునేందుకు ప‌రిత‌పిస్తాడు. ఆమె చుట్టూ తిరిగేంత వ‌ర‌కు బాగానే ఉంటుంది. ఎప్పుడైతే ఆమె తిరిగి ప్రేమించ‌డం మొద‌లు పెడుతుందో అప్పట్నుంచి త‌న స్వేచ్ఛని కోల్పోయిన‌ట్టుగా భావిస్తాడు హిప్పీ. మ‌రి వారి ప్రేమాయ‌ణం పెళ్లి వ‌ర‌కు వెళ్లిందా? లేదా? వీరి ప్రేమ‌క‌థ‌ని హిప్పీ బాస్ అయిన అర‌వింద్ (జేడీ చ‌క్రవ‌ర్తి) ఎలాంటి మ‌లుపు తిప్పాడు? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

సమీక్ష
హిప్పీ క్యారెక్టరైజేషన్ కొత్తగా అనిపిస్తుంది. కార్తికేయ కొత్తగా ట్రై చేశాడు. ఆ కొత్త దనం ప్రేక్షకులకు పెద్ద పరీక్షగా నిలుస్తుంది. కార్తికేయను ఆ అల్ట్రా మోడ్రన్ స్టైలిష్ లుక్ లో చూడలేకపోయాం. నీటిగా కటింగ్ చేసుకున్నప్పుడే బాగున్నాడు. గడ్డం మీసాలుతీసేసి జుట్టు పెంచుకున్నప్పుడు కార్తికేయను క్లోజ్ సీన్స్ లో చూడలేకపోయాం. కార్తికేయ పాత్ర అర్థం కాకుండా డిజైన్ చేశాడు. దర్శకుడి ప్రతిభా పైత్యం చూపించాడనిపించింది. తమిళ డైరెక్టర్ కావడంతో… తమిళ సినిమా వాసనల గుబాళింపు కనిపిస్తుంది.
ప్రేమలోని ఫిలాసఫీని తనకు నచ్చినట్టుగా చెప్పే ప్రయత్నం చేశాడు. ప్యారడైజ్ లాస్ట్ అనే దాని చుట్టూ తిరుగుతుంది. అయితే ఈ తత్వం ప్రేక్షకులకు ఎక్కాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అక్కడక్కడ హీరోయిన్ తో వచ్చే సీన్స్ పర్వాలేదనిపిస్తాయి. రొమాంటిక్ ఎరోటిక్ సీన్స్ బాగున్నాయి. స్టైలిష్ మేకింగ్ కెమెరా వర్క్ నచ్చుతుంది. కానీ సీన్స్ అంత కొత్తగా అనిపించవు. దీంతో బోరింగ్ గా ఫీలవుతాం. ట్రెండీ లుక్ ఉంటుంది. కానీ ట్రెండీ సీన్స్ మాత్రం ఉండవు.

లవ్ తర్వాత హీరోయిన్ పెట్టే టార్చర్ మనకు టార్చర్ గా అనిపిస్తుంది. కానీ సీన్స్ సరిగ్గా లేకపోయినా… హీరోయిన్ మాత్రం తన అందం పెర్ ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. లుక్స్ పరంగా క్యారెక్టర్ పరంగా ఆకట్టుకుంది. రొమాంటిక్ సీన్స్ లోనూ రెచ్చిపోయింది. ప్రేమను ఎలా అర్థం చేసుకోవాలి అనేది డైరెక్టర్ చెప్పే ప్రయత్నంచేశాడు. కానీ అది మనకు బోరింగ్ గా అనిపిస్తుంది. యూత్ ని టార్గెట్ చేసే సీన్స్ ఉన్నప్పటికీ….. స్టోరీకి పెద్దగా ఉపయోగపడేలా అనిపించవు. చిన్న స్టోరీ లైన్ ను సాగదీశాడు. కథనం కూడా ఇంట్రస్టింగ్ గా అనిపించవు. ఇందులో సామాన్య ప్రేక్షకుడికి అర్థం కాని విష‌యాలు చాలా ఉంటాయి. ప్యార‌డైజ్‌, ఎరెక్షన్‌, ఇంపొటెంట్ అంటూ మ‌ల్టీప్లెక్స్ ప్రేక్షకులు మాత్రమే అర్థం చేసుకొనే విష‌యాలున్నాయి.

డబుల్ మీనింగ్ డైలాగ్స్ విచ్చలవిడిగా వాడారు. ముఖ్యంగా జెడి క్యారెక్టర్ తో చాలా డబుల్ మీనింగ్ డైలాగ్స్ చెప్పించారు. క్లైమాక్స్ పార్ట్ పెద్దగా ఇంట్రస్టింగ్ గా అనిపించదు. ప్రెడిక్టబుల్ సీన్స్ తో సాగదీశాడు. కొత్తగా ప్రయత్నించామని వాళ్లు అనుకున్నప్పటికీ… ఇదేం క్లైమాక్స్ రా బాబూ అని తల పట్టుకుంటాం. హీరో హీరోయిన్ కొట్టుకునే సీన్ ని సాగిదీసీ సాగదీసి రాచి రంపాన పెట్టినట్టుగా అనిపిస్తుంది.

కార్తికేయ కొత్తగా ట్రై చేసినప్పటికీ…కథ కంటేకూడా షర్ట్ లేకుండా ఉండేందుకే ఎక్కువగా ట్రై చేశాడు. షర్ట్ విప్పడం మీద చూపించిన శ్రద్ధ సినిమా కూడా పెట్టి ఉంటే బాగుండేది. కథను వైవిధ్యంగా ఇంట్రస్టింగ్ గా మలచడంలో దర్శకుడు పూర్తిగా విఫలమయ్యాడు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నప్పటికీ… సరైన కథ కథనాలు లేకపోవడంతో హిప్పీ తలనొప్పిగా మారింది. సో లైట్ తీసుకోవడం బెటర్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here