Home Movie News బాలకృష్ణ వివాదంపై నోరు విప్పిన హైపర్ ఆది..

బాలకృష్ణ వివాదంపై నోరు విప్పిన హైపర్ ఆది..

0
SHARE
Hyper Aadi Balakrishna | telugu.itsmajja.com

ఈ మధ్య కామెడీ కంటే కాంట్రవర్సీలు ఎక్కువ చేస్తున్నాడు హైపర్ ఆది. ఆయన పేరు కూడా జబర్దస్త్ లో కంటే బయటికి ఎక్కువగా వినిపిస్తుంది. ఇప్పుడు దానికి కారణాలు చాలానే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ జనసేనకు సపోర్ట్ చేస్తూ ఆ మధ్య వైసీపీతో వివాదానికి దిగారు హైపర్ ఆది. ఇది చాలా పెద్ద ఇష్యూ అయ్యింది కూడా. పవన్ కళ్యాణ్ అండ చూసుకొని ఈయన రెచ్చిపోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో కూడా హైపర్ ఆదిపై చాలా విమర్శలు వస్తున్నాయి.

ఇలాంటి సమయంలో ఒక ఇంటర్వ్యూలో బాలకృష్ణతో గొడవ గురించి మనసులో మాట బయటకు చెప్పాడు ఈ కమెడియన్. అప్పట్లో బాలకృష్ణ నుంచి ఈయనకు ఒక వార్నింగ్ వచ్చిందని.. ఎక్స్ ట్రాలు చేస్తే చంపేస్తామని వాళ్ళు బెదిరించినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై ఇప్పుడు అసలు విషయం బయట పెట్టాడు హైపర్ ఆది. బాలయ్య నుంచి తనకు వార్నింగ్ రావడం అనేది అబద్ధం అని చెప్పాడు ఆది. అప్పట్లో అదిరే అభి టీంలో ఉన్నప్పుడు బాలయ్య గురించి ఒక స్కిట్ చేశామని.. అది చేసినప్పుడు ఒక ఫ్యాన్ ఫోన్ చేసి చిన్న వార్నింగ్ ఇచ్చిన మాట వాస్తవమే.. కానీ అది కూడా తనకు కాదని చెప్పాడు హైపర్ ఆది.

తన టీమ్ లోనే బాలయ్య పాత్ర చేసిన మరొకరికి వార్నింగ్ వెళ్లిందని.. అయితే అప్పుడు బయటికి వచ్చి క్షమాపణ చెప్పింది తాను కాబట్టి తనకు వార్నింగ్ ఇచ్చాడని యూట్యూబ్ ఛానల్ ఛానల్స్ అన్నీ రాసేసాయని చెప్పాడు హైపర్ ఆది. వాళ్ల రేటింగ్ కోసం చేసిన పనికి తాను బలయ్యానని చెబుతున్నాడు ఈ కమెడియన్. మొత్తానికి ఈ వివాదాలు తగ్గించుకుంటే హైపర్ ఆది కెరీర్ బాగుంటుందని.. లేదంటే మూడునాళ్ళ ముచ్చటగా మిగిలిపోతుందని కొందరు ఆయనకు స్వీట్ వార్నింగ్ కూడా ఇస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here