Home Movie News నాపై ఆరోపణలు కరెక్ట్ కాదు – జీవిత రాజశేఖర్.

నాపై ఆరోపణలు కరెక్ట్ కాదు – జీవిత రాజశేఖర్.

0
SHARE
Jeevitha Rajasekhar | telugu.itsmajja.com

జీవిత రాజశేఖర్… సినిమాతో పాటు రాజకీయంగానూ.. ఏదో ఓ రూపంలో వాత్రల్లో నిలుస్తుంటారు. తాజాగా మరో వివాదం వీరిని చుట్టుకుంది. ఆ మధ్య జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో గెలిచి మంచి పదవుల్లో ఉన్నారిద్దరూ… ఈసమయంలో మా కు చెందిన నిధుల దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. కూతుర్లు శివాని శివాత్మిక ఎకౌంట్స్ లోకి మా నిధులు మళ్లాయనేది ఆ అభియోగం. ప్రభుత్వానికి చెందిన యాడ్స్ రూపొందిస్తామని చెప్పి… నిధుల్ని తమ వైపుకు తిప్పుకున్నారని కొంతమంది ఆరోపించారు. ఈ విషయం టాలీవుడ్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆయితే దీనిపై జీవిత వివరణ ఇచ్చుకున్నారు.

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి పథకం భారీగా సక్సెస్ అయ్యింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో కూడా కళ్యాణ లక్ష్మి పథకానికి లబ్దిదారులు ఎవరైనా ఉంటే తాము హెల్ప్ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీనికి బదులుగా ఆ పథకానికి మంచి పబ్లిసిటీ తీసుకొచ్చేందుకు యాడ్స్ రూపొందిస్తామని అన్నారు. దీని బాధ్యతను తాము తీసుకున్నామని వారన్నారు. దీనికి ఖర్చు ఏడున్నర లక్షలు అయ్యిందంటున్నారు. ఇంత తక్కువలో ఎవ్వరూ యాడ్స్ చేయరని అంటున్నారు.  ఈ యాడ్స్ ఖర్చును జీవితే భరించిందట. మా అధ్యక్షుడు నరేశ్ ఊర్లో లేని సమయంలో ఈ ఖర్చును తాను భరించానని… ఆయన వచ్చిన తర్వాత మా అసోసియేషన్ అకౌంట్ నుంచి తమ ఎకౌంట్ కు బదిలీ చేశారని జీవిత అంటోంది. ఆ పథకం వల్ల తెలుగు ఇండస్ట్రీలోని చాలా మందికి లాభం జరుగుతుంది కాబట్టే… సపోర్ట్ చేశామని నిధుల దుర్వినియోగం చేశాం అనే దాంట్లో నిజాలు ఏంత మాత్రం లేవని అంటోంది జీవిత.

ఈ వివాదం ఇంతటితో ముగుస్తుందా… జీవిత ఇచ్చిన ఆన్సర్ కు…. అభియోగం మోసిన వారు శాటిస్ ఫై అవుతారా లేదా అన్నది చూడాల్సిన విషయం….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here