Home Movie News ఇమేజ్ నిలబెట్టుకోలేక పోయిన ఆర్ఎక్స్ 100 కార్తికేయ..

ఇమేజ్ నిలబెట్టుకోలేక పోయిన ఆర్ఎక్స్ 100 కార్తికేయ..

0
SHARE
Kartikeya | telugu.itsmajja.com

ఇండస్ట్రీలో విజయం రావడం అనేది చిన్న విషయం కాదు. అందులోనూ కొత్త హీరోలకు కోరుకున్న విజయం అంత ఈజీగా రాదు. చాలా అరుదుగా బ్లాక్ బస్టర్ వస్తుంటుంది. ఆర్ఎక్స్ 100 సినిమాతో గత ఏడాది అలాంటి ఊహించని బ్లాక్ బస్టర్ అందుకున్నాడు కార్తికేయ. దానికి ముందు ఆయన చేసిన సినిమా కనీసం ప్రేక్షకులకు తెలియదు కూడా. కానీ ఆర్ఎక్స్ 100 లాంటి బోల్డ్ సినిమాతో బ్లాక్ బస్టర్ అనుకున్నాడు కార్తిక్. ఆ సినిమా ఇచ్చిన ఉత్సాహంలోనే ఇప్పుడు హిప్పీ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఆర్ఎక్స్ 100 సినిమా తర్వాత తెలుగు దర్శకులను కాకుండా తమిళ దర్శకుడుని నమ్ముకొని ఇప్పుడు భారీ మూల్యం చెల్లించాడు కార్తికేయ. ఇక్కడ మన ప్రేక్షకులను మెప్పించలేక.. అటు తమిళ ప్రేక్షకులను అలరించలేక రెంటికి చెడ్డ రేవడిలా మారిపోయాడు కార్తికేయ. ఈ సినిమా అసలు వచ్చిన విషయం కూడా ప్రేక్షకులకు తెలియదు అంటే కార్తికేయ ఇమేజ్ ఎంత దారుణంగా పడిపోయిందో అర్థమవుతుంది. ఆర్ఎక్స్ 100 ఇమేజ్ ఈ సినిమాతో నిలబెట్టుకోలేకపోయాడు ఈ కుర్ర హీరో. కాస్త సరైన ప్లానింగ్ వేసుకొని మంచి దర్శకులకు అవకాశం ఇచ్చి ఉంటే తెలుగులో కచ్చితంగా కార్తికేయ సక్సెస్ అయి ఉండేవాడు అంటున్నారు విశ్లేషకులు.

కానీ ఆర్ఎక్స్ 100 తర్వాత నేరుగా తమిళ ఇండస్ట్రీకి వెళ్లిపోవడం.. అక్కడ పెద్ద బ్యానర్లో సినిమా రాగానే కథ కూడా పట్టించుకోకుండా సినిమా చేయడంతో ఇప్పుడు అనవసరంగా ఒక ప్లాప్ మూట కట్టుకున్నాడు కార్తికేయ. ఈ ఫ్లాప్ లోటు భర్తీ చేయాలి అంటే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ ఇవ్వాల్సిందే. కానీ ఇప్పుడు మనోడి చేతిలో పెద్దగా సినిమాలేవీ లేవు. పైగా నాని, విక్రమ్ కె.కుమార్ సినిమాలో కార్తికేయ విలన్ గా నటిస్తున్నాడు. ఒక్కసారి ప్రతినాయకుడిగా క్లిక్ అయితే హీరో పాత్రలు రావడం కూడా కష్టమే. దాంతో కెరీర్ మొదట్లోనే అనూహ్య నిర్ణయాలు తీసుకొని తన కెరీర్ను డేంజర్ పొజిషన్లో పడేసుకున్నాడు కార్తికేయ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here