Home Reviews ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీ రివ్యూ

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీ రివ్యూ

0
SHARE
Lakshmi's NTR Telugu Movie Review | telugu.itsmajja.com

Rating : 3/5

మహా నాయకుడు, కథానాయకుడు ఎన్ఠీఆర్ బయో పిక్ గా రూపొందించారు. అవి రెండూ ప్లాప్ అయ్యాయి. దానికి కొనసాగింపా అన్నట్టుగా రాం గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. రూపొందించాడు. ఈ సినిమా పలు వివాదాలు ఎదుర్కొంది. ఆంధ్రప్రదేశ్ లో సినిమా విడుదల కాకుండా కోర్ట్ తీర్పు ఇచ్చింది. తెలంగాణ లో ఓవెర్సెస్ లో మాత్రమే విడుదలైన ఈ సినిమా పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. మరి ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.

కథేంటంటే…  ఎన్టీఆర్ కు జరిగిన వెన్నుపోటు అంశాన్ని మెయిన్ గా తీసుకున్నారు. ఎన్టీఆర్ (పి విజయ్ కుమార్) తన మన దేశం పార్టీ ఓడిపోయిన తరువాత, ఒంటరిగా ఉంటున్న రోజులో లక్ష్మీ పార్వతి (యజ్ఞ శెట్టి) ఎన్టీఆర్ జీవిత చరిత్ర రాస్తా అంటూ వస్తుంది. మొదట వద్దన్నా.. ఆమె విషయ పరిజ్ఞానం చూసి అవకాశం ఇస్తాడు. పుస్తకం రాసే క్రమంలో ఆమెను విపరీతంగా ఇష్టపడతాడు. అప్పటికే ఆమెకు పెళ్లై కొడుకు కూడా ఉంటాడు. అది నచ్చని సి.బి నాయుడు (శ్రీ తేజ్) మరియు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు లక్ష్మీ పార్వతిని ఎన్టీఆర్ కి దూరం చెయ్యటానికి ప్రయత్నిస్తారు. ఆ తర్వాత ఎన్ఠీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు. లక్ష్మి పార్వతి పెత్తనం చేలాయిస్తుందని వార్తలు పుట్టించి…. ఎమ్మెల్యేలను తన వైపుకు తిప్పుకుంటాడు. ఆ తర్వాత అధికారం కోల్పోతాడు. అటు రాజకీయాలు, ఇటు ఫ్యామిలీ దూరం కావడంతో ఎన్ఠీఆర్ మనస్తాపంతో చనిపోతాడు.

సమీక్ష…
రాంగోపాల్ వర్మ ఈజ్ బ్యాక్ అని ఈ సినిమా చూసిన వాళ్ళు అంటున్నారు. మనం కూడా ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే ఘోరమైన ఫ్లాప్స్ ఇచ్చిన వర్మ ఈ సినిమాను బాగానే తీసాడు. ఐతే ఇందులో అగస్త్య మంజు వాటా చాలానే ఉంది. పొలిటికల్ గా అటెన్షన్ క్రియేట్ చేయగలిగారు వర్మ అండ్ టీం. ఇందులో వాస్తవాలు ఎంత అనేది పక్కన పెడితే.. సినిమాగా ఐతే బోర్ కొట్టదు. ఒక కథలాగా వెళ్తుంది. చాలా విషయాలు మనం విన్నవే విజువల్ గా చూసినప్పుడు థ్రిల్ కి గురవుతాం. ఎన్టీఆర్ ను సీఎం పీఠం నుండి దించే సీన్ ఎమోషనల్ గా ఉంటుంది. అసలు ఎన్టీఆర్ ను ఎందుకు అధికారంలో నుండి దించారు ? ఎలాంటి వ్యూహాలతో ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచారు ? చివరికి ఎన్టీఆర్ ఎంత బాధతో చనిపోయారు ? చనిపోవడానికి దారితీసిన పరిస్థితులు బాగా చూపించాడు.

ఎన్టీఆర్ పాత్రలో పి విజయ్ కుమార్ చాలా బాగా నటించారు. ఎన్టీఆర్ హావభావాలను, తన ముఖ కవళికల్లో పలికించిన విధానం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.
లక్ష్మి పార్వతి పాత్రను పోషించిన యజ్ఞ శెట్టి అద్భుతంగా నటించి మెప్పించింది. ముఖ్యంగా ఎన్టీఆర్ – లక్ష్మి పార్వతిల మధ్య వచ్చే కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో చాల బాగా నటించింది. సి.బి నాయుడు పాత్రలో కనిపించిన శ్రీ తేజ్, ఆ పాత్రకు తగ్గట్లు చాలా బాగా నటించాడు. మెయిన్ గా తన లుక్స్ తోనే విలనిజాన్ని పండించాడు. ఇందులో హరికృష్ణ, బాలకృష్ణ పాత్రలు కూడా ఇంపార్టెంట్.

ఇందులో వాస్తవాలు సరిగ్గా ఎవ్వరికీ తెలియవు కాబట్టి వర్మ సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నాడు. వెన్నుపోటు ఘట్టం చాలా కీలకమైంది. కొందరికి ఈ సీన్స్ నచ్చుతాయి. కొందరికి నచ్చవు.

ఐతే సినిమా స్లో నరేషన్ కాబట్టి ఓపిక కూడా కావాలి. ఇది అన్నివర్గాల్ని మెప్పించే సినిమా అస్సలు కాదు. తెలిసిన ఆర్తిస్తులు కూడా లేరు. ఎక్కువుగా రెండు పాత్రల మధ్యే నడిపడంతో సినిమాని బాగా సాగతీసినట్లుగా అనిపిస్తుంది. పైగా కొత్త విషయాలు లేకపోగా అందరికీ తెలిసిన విషయాలనే మళ్ళీ చూపించారు. ఇక ఎన్టీఆర్, లక్ష్మి పార్వతి, సి. బి నాయుడు పాత్రలు తప్ప మిగితా పాత్రలు పెద్దగా రిజిస్టర్ అవ్వవు.

సంగీత దర్శకుడు కళ్యాణి కోడూరి తన పాటలతోనే కాకుండా, తన నేపథ్య సంగీతంతో కూడా ఆకట్టుకున్నారు. ఇక సినిమాటోగ్రఫీ వర్క్ చాలా బాగుంది. కథకి అనుగుణంగా సినిమాలోని సన్నివేశాలని, అప్పటి పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు చక్కగా చిత్రీకరించారు.

ఓవరాల్ గా…. వర్మ తన పబ్లిసిటీ తోనే కాదు… సినిమా పరంగానూ ఒకే అనిపించాడు. అగస్త్య మంజు దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు.. ఎటొచ్చీ ఒకరిని టార్గెట్ చేసిన సినిమా కాబట్టి.. కమర్షియల్ గా ఎంతవరకు వర్క్ ఔట్ అవుతుందో చూడాలి.

తీర్పు :

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్ కు జరిగిన వెన్నుపోటు ఘట్టాన్ని ప్రధానాంశంగా తీసుకుని తీసిన ఈ చిత్రం పూర్తి ఆసక్తికరంగా సాగలేదు. అయితే కొన్ని చోట్ల ఎమోషనల్ గా సాగుతూ అక్కడక్కడ పర్వాలేదనిపిస్తోంది. అయితే సినిమాలో కొన్ని సీన్స్ ను ఎమోషనల్ గా నడిపిన దర్శకులు, చాలా సన్నివేశాల్లో మాత్రం ఆ ఎమోషన్ని ఆ స్థాయిలోనే కంటిన్యూ చేయలేక పోయారు. ముఖ్యంగా ఎన్టీఆర్ చివరి రోజుల్లో జరిగిన కొన్ని నాటకీయ అంశాలనూ, అప్పటి పరిస్థితులను చాలా ఆసక్తికరంగా చూపించడంలో దర్శకులు విఫలం అయ్యారు. పైగా ఎన్టీఆర్, లక్ష్మి పార్వతితో తనని పెళ్లి చేసుకోమని అడిగినట్లు చెప్పించే సీన్ లాంటి కొన్ని సీన్స్ బాగా నిరుత్సాహ పరుస్తాయి. మొత్తం మీద ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అంచనాలను అందుకోలేకపోయింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులని ఎంత వరకు అలరిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here