Home Reviews లవర్స్‌ డే మూవీ రివ్యూ…

లవర్స్‌ డే మూవీ రివ్యూ…

0
SHARE
Lovers Day Movie review | telugu.itsmajja.com

ప్రియా ప్రకాష్ వారియర్…. ఈ పేరు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో మారు మోగుతోంది. సెలెబ్రిటీలు సైతం ఈ పిల్ల కన్ను గీటితే పడిపోయారు. ప్రియా వారియర్ ముఖ్య పాత్రలో నటించిన లవర్స్ డే చిత్రం ఎట్టకేలకు ప్రేక్షకుల దగ్గరికి వచ్చింది. మ‌ల‌యాళంలో తెర‌కెక్కిన ‘ఒరు ఆడార్‌ ల‌వ్‌’ సినిమాను తెలుగులోకి డబ్బింగ్ చేశారు. నూరిన్ షెరిఫ్‌, రోష‌న్‌, మాథ్యూ

Priya Prakash Varrier

జోస‌ఫ్‌, వైశాఖ్ ప‌వ‌న‌న్‌, మైఖేల్ యాన్ డేనియ‌ల్‌, దిల్‌రూపా, హ‌రీష్ పెరుమ‌న్న‌, అనీష్ జి మీన‌న్‌, షాన్ సాయి, అర్జున్ హ‌రికుమార్‌, అతుల్ గోపాల్‌, రోష్న అన్‌రాయ్ త‌దిత‌రులు మిగిలిన పాత్రల్లో నటించారు. ఎ. గురురాజ్‌, సి.హెచ్‌. వినోద్‌రెడ్డి తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమాను అందించారు. క‌థ‌, ద‌ర్శ‌క‌త్వం: ఒమ‌ర్ లులు మరి ఈ సినిమా ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పించిందో చూద్దాం.

కథేంటంటే….
ఇంట‌ర్‌ కాలేజీ నేప‌థ్యంలో ఈ ప్రేమకథ సాగుతుంది. రోష‌న్ (రోష‌న్‌), ప్రియా (ప్రియా వారియ‌ర్‌), గాథ జాన్ (నూరిన్ షెరిఫ్‌), మాథ్యూ (మాథ్యూ జోసెఫ్‌), ప‌వ‌న్ (వైశాఖ్ ప‌వ‌న‌న్)… వీళ్లంతా స్నేహితులు. ఒకే త‌ర‌గ‌తిలో చ‌దువుతుంటారు. వీళ్ల‌లో రోష‌న్‌, ప్రియా ప్రేమికులు. గాథ మంచి ఫ్రెండ్. అయితే ఓ సారి అనుకోకుండా… కాలేజ్ వాట్సాప్ గ్రూపులో రోషన్ ఫ్రెండ్ రోషన్ ఫోన్ నుంచి బూతు వీడియోలు పోస్ట్ చేస్తాడు. దీంతో కాలేజ్ నుంచి వన్ వీక్ రోషన్ సస్పెండ్ అవుతాడు. ప్రియా రోషన్ ను ఛీ కొడుతుంది. బ్రేకప్ చెబుతుంది. ఆ తర్వాత పోలీసుల సహాయంతో…. గాథ హెల్ప్ చేయడం వల్ల బయటపడతాడు. ఆ తర్వాత గాథ, రోషన్ కొన్ని పరిస్థితుల్లో లవర్స్ అవుతారు. అదే సమయంలో ప్రియా తన తప్పు తెలుసుకొని రోషన్ దగ్గరికి వస్తుంది. ఇంతకూ రోషన్ ఎవరిని లవ్ చేస్తాడు. వీరి ప్రేమ ఎంతవరకు వచ్చింది…. అనేది తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే.

సమీక్ష….
సినిమా ప్రథమార్థం సరదాగా సాగుతుంది. ఆర్టిస్టులు చాలా బాగా చేశారు. పర్ ఫెక్ట్ క్యాస్టింగ్. ముఖ్యంగా ప్రియా ప్రకాష్ తన కన్ను గీటి ఆకట్టుకుంది. రోషన్ ప్రియా పెయిర్ చాలా బాగుంది. కాలేజ్ డేస్ ని గుర్తు చేసే విదంగా సీన్స్ ఉంటాయి. మధ్య మధ్యలో ఫ్రెండ్స్ తో చేసే సరదాలు, స్టూడెంట్స్ లెక్చరర్స్ మధ్య సీన్స్ సరదాగా ఉంటాయి. తెలుగులో హ్యాపీడేస్ చిత్రాన్ని గుర్తుకు తెస్తుంటాయి. స్టూడెంట్ లెక్చరర్ ని లవ్ చేసే సీన్ కూడా ఉంది. ఫ్రెషర్ డే, యాన్యువల్ డే కూడా ఉంది. క్లైమాక్స్ ని మాత్రం ఊహించని విధంగా ముగించాడు దర్శకుడు.

ఈ సినిమాకు ప్రధానమైన మైనస్ స్లో నరేషన్. కొత్తగా అనిపించే సీన్స్ మచ్చుకు కూడా కనిపించవు. భావోద్వేగమైన సీన్స్ చాలా తక్కువ. ఈ తరహా సినిమాలు ఇదివరకే చాలా చూసి ఉండడంతో తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా ఏం అనిపించదు. సాడ్ క్లైమాక్స్ సాడ్ గానే మిగులుస్తుంది. ఈ తరహా క్లైమాక్స్ సినిమాలు తెలుగులో ఆడిన దాఖలాలు చాలా తక్కువ. సాడ్ క్లైమాక్స్ ని దర్శకుడు ఎందుకు ఎంచుకున్నాడో అర్థం కాదు. హీరో, హీరోయిన్ ను చంపేయాలని దర్శకుడు ఎందుకు భావించాడో అర్థం కాదు. అది కూడా సిల్లీగా చూపించాడు. అదే ఈ సినిమాకు మైనస్ గా మారింది. భావోద్వేగమైన సన్నివేశాల్ని రాసుకోవడంలో దర్శకుడు విఫలమయ్యాడు. రోషన్, గాథ పెయిర్ బాగుంది. కానీ మంచి సీన్స్ పడి ఉంటే బాగుండేది. మనకు తెలియని ఆర్టిస్టులు సింక్ కాని డబ్బింగ్ ప్రేక్షకుల్ని బాగా ఇబ్బంది పెడతాయి. గాథ పాత్రలో నటించిన నూరిన్ కు చాలా మంచి పేరొస్తుంది. చాలా బాగా నటించింది. సాంకేతికంగా బాగుంది. సినిమా క్వాలిటీగా ఉంటుంది. పాటలు బాగున్నాయి. కెమెరా వర్క్ రిచ్ గా అనిపించింది. నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి.

ఓవరాల్ గా….

దర్శకుడు సినిమాకు పబ్లిసిటీ తీసుకొచ్చే కన్నుగీటే సీన్ ను బాగా ప్లాన్ చేశాడు. కానీ అదే స్థాయిలో సినిమాలో కథ, కథనం లేకపోవడం మైనస్ గా మారింది. ఎంచుకున్న ప్లాట్ బాగున్నప్పటికీ… తెలుగు ప్రేక్షకులు ఆశించే అంశాలు లేకపోవడం మైనస్. అలాగే తెలుగు ప్రేక్షకులు ఇంత స్లో సినిమాల్ని, సాడ్ క్లైమాక్స్ ని అంతగా నప్పరు. కానీ దర్శకుడు సాడ్ ఎండింగ్ ఇచ్చాడు. ఏది ఏమైనా ఇంత ఫ్రీ పబ్లిసిటీ వచ్చినప్పటికీ కంటెంట్ వీక్ కావడంతో ప్రేక్షకులు పెద్దగా ఆదరించే అవకాశం లేదు.

PB Rating : 2.5/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here