Home Movie News విజయ్ దేవర కొండతో మహేష్ సినిమా

విజయ్ దేవర కొండతో మహేష్ సినిమా

0
SHARE
Maharshi Movie | telugu.itsmajja.com

మహేష్ ఇంకా సూపర్ స్టార్ గా వెలుగొందుతున్నాడు. నిన్నటికి నిన్న రిలీజ్ అయిన మహర్షి ఏ రేంజ్ కలెక్షన్స్ సాధించిందో చూశాం. ఇలాంటి సమయంలో ఇప్పుడిప్పుడే కెరీర్ లో దూసుకెళ్తున్న విజయ్ దేవరకొండతో చనువుగా ఉండడం చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారని వినికిడి. నిజానికి మహేష్ బాబు సినిమా ఫంక్షన్స్ కి గెస్టులు అవసరం లేదు. అలాంటి మహేష్ బాబు మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం వెంకటేష్ తో పాటు విజయ్ దేవరకొండ కూడా గెస్టుగా రావడం అందరికీ షాక్ ఇచ్చింది. వెంకటేష్ అంటే గెస్ట్ గా అర్హుడే. కానీ విజయ్ ని పిలవడంపై చాలా మంది చర్చించుకున్నారు. ఆ ఈవెంట్ పక్కనపెడితే… నిన్నటికి నిన్న మహేష్ ఇంట్లో జరిగిన పార్టీలో విజయ్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మిగలడంతో… విజయ్ కు మహేష్ కు ఉన్న ఫ్రెండ్ షిప్ ఏంటి అనే అనుమానాలు రాకమానదు.

మహర్షి సక్సెస్ పార్టీ మహేష్ ఇంట్లో జరిగింది. ఈ పార్టీకి చిత్ర యూనిట్ తో పాటు.. విజయ్ దేవరకొండ కూడా వచ్చాడు. అయితే చిత్ర యూనిట్ కాకుండా అక్కడ కనిపించింది విజయ్ దేవరకొండ మాత్రమే. మహేష్ ఫ్రెండ్స్ రాంచరణ్, ఎన్టీయార్, సుమంత్ లాంటి వారు కాకుండా సర్ ప్రైజింగ్ గెస్ట్ గా విజయ్ కనిపించడం ఆ ఫొటోలు మీడియాకు పంపడం కాస్త ఆలోచనకు గురి చేసింది. అయితే విజయ్ ను ఈ మధ్య మహేష్ బాగా దగ్గర తీస్తున్నాడు. త్వరలో మహేష్ బాబు ప్రొడక్షన్ లో విజయ్ దేవరకొండ ఓ సినిమా చేయబోతున్నాడనే టాక్ వినిపిస్తోంది. దీంతో పాటు ఫ్యూచర్లో మహేష్ విజయ్ కలిసి ఓ సినిమా చేసే అవకాశం కూడా అందనే గాసిప్స్ ప్రారంభమయ్యాయి.

ఏది ఏమైనా విజయ్ దేవరకొండ టాలెంటెడ్ ఆర్టిస్ట్. తక్కువ కాలంలో ఎక్కువ పాపులారిటీ సంపాదించుకొని పది కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసే స్థాయికి చేరుకున్నాడు. సో… మహేష్ విజయ్ ని ఎంకరేజ్ చేయడంలో తప్పే లేదంటున్నారు ఆయన అభిమానులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here