Home Movie News బాలయ్య ఫాన్స్ కు ఊహించని షాక్ ఇస్తున్న మోక్షజ్ఞ..

బాలయ్య ఫాన్స్ కు ఊహించని షాక్ ఇస్తున్న మోక్షజ్ఞ..

0
SHARE
Mokshagna | telugu.itsmajja.com

బాలకృష్ణ నటవారసుడు నందమూరి మోక్షజ్ఞ ఇండస్ట్రీకి ఎప్పుడెప్పుడు వస్తాడా అని వెయ్యి కళ్లతో వేచి చూస్తున్నారు అభిమానులు. బాలయ్య కూడా తన వారసుడు ఎంట్రీ గురించి ఎప్పటికప్పుడు మీడియాతో మనసులో మాట పంచుకుంటూనే ఉన్నాడు. 2020 లో మోక్షజ్ఞ ఖచ్చితంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు అంటూ బాలయ్య ఆ మధ్య చెప్పాడు. అయితే ఇప్పుడు వినిపిస్తున్న వార్తలు మాత్రం అభిమానులకు షాక్ ఇస్తున్నాయి.

నందమూరి మోక్షజ్ఞకు సినిమాలు అంటే పెద్దగా ఆసక్తి లేదనే విషయం బయటికి వచ్చింది. అందుకే ఆయన కూడా ఫిజిక్ పై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. ఈ మధ్య బయటికి వచ్చిన కొన్ని ఫోటోలు చూసిన తర్వాత నందమూరి మోక్షజ్ఞ అసలు సినిమాలు చేస్తాడా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే అందులో లో లావుగా కనిపిస్తున్నాడు మోక్షజ్ఞ. బరువు తగ్గడం పెద్దగా విషయం కాదేమో కానీ సినిమాలంటే ఆసక్తి లేదు అనేది మాత్రం ఇప్పుడు అభిమానులను కలవర పెడుతున్న విషయం.

ఈయనకు నటన కంటే కూడా బిజినెస్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సిటీలోనే కాఫీ షాప్ బిజినెస్ పెట్టాలనేది నందమూరి మోక్షజ్ఞ ఐడియా అని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై బాలకృష్ణ కూడా ఏమీ మాట్లాడటం లేదు. ఏదో విధంగా కచ్చితంగా తనయుడిని ఒప్పించి ఇండస్ట్రీలోకి తీసుకు రావాలని నందమూరి బాలయ్య ప్రయత్నిస్తున్నాడు. ఎందుకంటే నందమూరి వంశం నుంచి ఇప్పటికే కొత్త హీరో వచ్చి పదమూడేళ్లు దాటిపోయింది. కళ్యాణ్ రామ్ తరువాత ఇప్పటివరకు నందమూరి కుటుంబంలో కొత్త ముఖం కనిపించలేదు. దాంతో మోక్షజ్ఞ కోసం వేయికళ్లతో అభిమానులు వేచి చూస్తున్నారు. మరి వాళ్ళ ఆశలను మోక్షజ్ఞ నిలబెడతాడో లేదంటే బిజినెస్ అంటూ సైడ్ ట్రాక్ ఎక్కుతాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here