Home Reviews మిస్టర్ మజ్ను మూవీ రివ్యూ

మిస్టర్ మజ్ను మూవీ రివ్యూ

0
SHARE
Mr Majnu movie review | telugu.itsmajja.com

Rating : 2.5/5

అఖిల్ అక్కినేని ఓ మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. అఖిల్ సినిమా డిజాస్టర్ గా నిలవడం… హలో ఓకే అనిపించుకోవడంతో…. సూపర్ హిట్ అఖిల్ కు తప్పనిసరైంది. అందుకే తొలిప్రేమతో సూపర్ హిట్ అందుకున్న వెంకీ ని దర్శకుడిగా ఎంచుకున్నాడు. తొలిప్రేమ తో హిట్ అందుకున్న బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత. నిధి అగర్వాల్ హీరోయిన్. తమన్ మ్యూజిక్ అందించాడు. మరి తొలిప్రేమతో హిట్ అందుకున్న వెంకీ రెండో ప్రయత్నం సఫలీకృతం అయ్యిందా…ద్వితియ విజ్ఞం దాటాడా… సూపర్ హిట్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్ దక్కించుకున్నాడా లేదా అన్నది తెలియాలంటే మాత్రం రివ్యూ చదవాల్సిందే.

 

కథేంటంటే…

విక్కీ (అఖిల్) లైఫ్ ని జాలీగా ఎంజాయ్ చేస్తుంటాడు. చదువు మీద కంటే అమ్మాయిలమీద కాన్ సన్ ట్రేషన్ ఎక్కువ. అమ్మాయిని ఇలా చూడగానే అలా పడేస్తుంటాడు. అమ్మాయిలు కూడా ఈజీగానే పడుతుంటారు. అలాంటి విక్కీ లైఫ్ లోకి వస్తుంది నిక్కీ (నిధి అగర్వాల్). తాను మాత్రం రాముడి లాంటి వాడిని పెళ్లిచేసుకోవాలనుకుంటుంది. కానీ ఓ పెళ్లి వల్ల ఇద్దరూ రిలేటివ్స్ అవుతారు. విక్కీ మంచితనం తనకు నచ్చుతుంది. ప్రేమలో పడుతుంది. కానీ రెగ్యులర్ ప్రేమలు అంటే తనకు గిట్టవని చెబుతాడు. కానీ ఓ నెలరోజులు ప్రేమించుకుందామంటుంది నిక్కీ. అలా ఇద్దరూ బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ గా ఉంటారు. కానీ నిక్కీ ప్రేమించే పద్ధతి… తనకు నచ్చినట్టుగా మాత్రమే ఉండాలనే రూల్స్ అఖిల్ కు నచ్చవు. వీరిద్దరి లవ్ మ్యాటర్ రెండు కుటుంబాలకు తెలుస్తుంది. వాళ్లంతా హ్యాపీనే. కానీ అఖిల్ నిజంగా ఆ అమ్మాయిని ప్రేమించడు. ఆ విషయం నిక్కీకి కూడా తెలిసి లండన్ కు వెళ్లిపోతుంది. ఆ తర్వాత కొద్దిరోజులకు రియలైజ్ అవుతాడు అఖిల్. అతను కూడా నిక్కీ కోసం లండన్ వెళ్తాడు. ఇప్పుడు అఖిల్ ప్రేమించడం మొదలు పెడతాడు. అసహ్యించుకోవడం నిక్కీ వంతు. చివరకి నిక్కీ అఖిల్ కు దగ్గరైందా. అఖిల్ నిక్కీని ప్రేమలో పడేయగలిగాడా లేదా అన్నది అసలు కథ.

 

 

సమీక్ష

అఖిల్ ఈ సినిమాలో ప్లే బాయ్ లాగా బాగా సెట్ అయ్యాడు. అమ్మాయిల్ని పడేసే అబ్బాయి పాత్రలో కరెక్ట్ గా కనిపించాడు. దర్శకుడు సైతం అఖిల్ ను ప్లే బాయ్ లా బాగా చూపించాడు. అఖిల్ ఎస్టాబ్లిష్ మెంట్ సీన్స్ బాగున్నాయి. హీరోయిన్ ఎంటర్ అయిన తర్వాత సీన్స్ కూడా బాగా డిజైన్ చేశాడు. హీరో హీరోయిన్ మధ్య వచ్చే సీన్స్ లైవ్లీగా ఉన్నాయి. ఆ తర్వాత దర్శకుడు కథను ఫ్యామిలీ వైపు నడిపించాడు. బాబాయ్ అప్పు తీసుకోవడం… హామీ పత్రంపై కొడుకు సంతకం పెట్టకపోవడం…. హీరో  సంతకం పెట్టడం లాంటి సీన్స్ ని ఎమోషన్స్ లో చూపించాడు. ఈ సీన్స్ అన్నీ కూడా అస్సలు నచ్చని హీరోను హీరోయిన్ ప్రేమించడం కోసం డిజైన్ చేశాడు దర్శకుడు. ఎట్టకేలకు లవ్ లోకి ఎంటర్ అవ్వడం బలవంతవు ప్రేమ వైపు కథ సాగుతుంది. అయితే ఇదంతా మనం చాలా సినిమాల్లో చూసినవే. చాలా కథలు ఈ తరహాలో వచ్చినవే కానీ దర్శకుడు హీరో మాత్రం తాము కొత్తగా తీస్తున్నామనుకున్నారో ఏమో గానీ టైం పాస్ లాగా వెళ్తుందే తప్ప కొత్తగా ఫీల్ అయ్యింది మాత్రం పెద్దగా ఏం ఉండదు.

 

ఇక సెకండాఫ్ లో హీరో హీరోయిన్ ను ప్రేమలో పడేయాలి. దీని కోసం చాలా సీన్స్ రాసుకున్నారు. కానీ అవన్నీ రెగ్యులర్ గానే అనిపిస్తాయి. బుడ్డోడి కార్టూన్ కామెడీకి నవ్వే అవకాశం ఉంది. ఈ సినిమాకు ఫస్టాఫ్ లో ప్రియదర్శి, సెకండాఫ్ లో హైపర్ ఆది నవ్వించే ప్రయత్నం చేశారు. సెకండాఫ్ లో సీన్స్ బోరింగ్ గా నే సాగుతుంటాయి. పాటలు బాగా డిస్ట్రబెన్స్ గా ఉంటాయి. అలాగే ఎమోషన్ కూడా క్యారీ కాకపోవడంతో ప్రేక్షకులు బోర్ గా ఫీలయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. దానికి తోడు చాలా సినిమాల్ని పోలిన సీన్స్ వస్తుండడంతో.. ఆల్రెడీ చూసిన సినిమానే మళ్లీ చూస్తున్నట్టుగా ఉంటుంది.  ఎమోషన్స్ ని ఫోర్స్ డ్ గా రుద్దే ప్రయత్నం చేశారు. సెకండాఫ్ లో లవ్ ని ఎస్టాబ్లిష్ మెంట్ చేసే సీన్స్ అంతగా నప్పవు. ఇంప్రెసివ్ సీన్స్ రాసుకోవడంలో విఫలమయ్యారు. కామెడీ జనరేట్ చేసే సీన్స్ ఎక్కువగా ఉండాల్సింది. కానీ కామెడీ బాగా మిస్ అవుతాం. ఫస్టాఫ్ లో ప్రియదర్శి పండించింత కామెడీ సెంకడాఫ్ లో హైపర్ ఆది పైరసీ పుల్లారావ్ క్యారెక్టర్ ద్వారా పండించలేకపోయాడు. సెకండాఫ్ మరీ ఫ్లాట్ గా వెళ్తుంది. క్లైమాక్స్ అందరూ ఊహిచిందే.

 

ఈసారి తమన్ మ్యూజిక్ తో మ్యాజిక్ చేయలేకపోయాడు. రెగ్యులర్ ట్యూన్సే ఇచ్చాడు. ఆడియో పరంగా వీక్ గా ఉంది. రిరీకార్డింగ్ లో నూ పెద్దగా తన చేయిలేనట్టుగా ఉంది. జార్జ్ విలియమ్స్ కెమెరా వర్క్ చాలా బాగుంది. సినిమా టింట్ అద్బుతంగాఉంది. ఎస్వీసీసీ నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి.

 

ఫైనల్ గా….

అఖిల్ పాపం చాలానే ట్రై చేశాడు. కానీ దర్శకుడు కాస్త కథను ఇంట్రస్టింగ్ గా మలిచి ఉంటే బాగుండేది. రెగ్యులర్ సీన్స్… రెగ్యులర్ ప్యాటర్న్ స్క్రీన్ ప్లే కావడంతో పెద్దగా ఎంజాయ్ చేయలేం. కావాల్సినంత కామెడీ… ఎమోషన్ లేకపోవడం… హీరో హీరోయిన్ లవ్ తో పాటు ప్రేక్షకులు ట్రావెల్ చేసేంత సీన్స్ పండకపోవడం మైనస్. ఓవరాల్ గా జస్ట్ ఓకే మూవీగా నిలుస్తుంది.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here