Home Movie News అందాల‌న్నీ చూపిస్తున్న ఆ చిన్న‌ది..

అందాల‌న్నీ చూపిస్తున్న ఆ చిన్న‌ది..

0
SHARE
Nandita Swetha Latest Photoshoot | telugu.itsmajja.com

అసలే ఇది సినిమా ఇండస్ట్రీ.. ఇక్కడ హీరోలకంటే వారసత్వం ఉంటుంది కానీ హీరోయిన్లకు అంత అవకాశం ఉండదు. వాళ్ళు ఇక్క‌డ కొన్ని రోజులు అయినా ఉండాల‌న్నా.. అవకాశాలు అందుకోవాలన్నా ఉన్న ఒకే ఒక్క మార్గం అందాల ఆరబోత. మడికట్టుకుని కూర్చుంటే ఇక్క‌డ సరిపోదు. అందుకే ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా కూడా ఏదో ఓ సమయంలో కచ్చితంగా గ్లామర్ షో చేయాల్సిందే. మరో ఆప్షన్ కూడా లేదు. కీర్తిసురేష్, సాయిపల్లవి లాంటి హీరోయిన్లు కూడా అప్పుడ‌ప్పుడూ అందాలు ఆర‌బోస్తుంటారు.

అలా కాదని గ్లామర్ షోకు దూరంగా ఉంటే దర్శక నిర్మాతలు కూడా ఆ ముద్దుగుమ్మ‌ల‌ను దూరంగా ఉంచుతున్నారు. అందుకే అసలు ఎక్స్ పోజింగ్ అంటూ చేయని మాళవిక నాయర్ లాంటి ముద్దుగుమ్మలు కూడా ఈ మధ్య ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తున్నారు. ఇప్పుడు ఇదే జాబితాలోకి నందిత శ్వేతా కూడా చేరిపోయింది. ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాలో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న ఈ చిన్నదానికి ఆ తర్వాత చెప్పుకోదగ్గ అవకాశాలు రాలేదు.

శ్రీనివాస కళ్యాణంలో సెకండ్ హీరోయిన్ గా నటించినా కూడా కోరుకున్న గుర్తింపు అయితే రాలేదు. దాంతో ఇప్పుడు అందాల ఆరబోతకు తెరతీస్తోంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా సుమంత్ అశ్విన్ హీరోగా ప్రేమకథా చిత్రం 2లో నటిస్తుంది నందిత శ్వేత. ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా ఫుల్లుగా గ్లామర్ షో చేస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది నందిత‌. దాంతో పాటు ప్రత్యేకంగా ఒక హాట్ ఫోటోషూట్ చేసింది నందిత శ్వేత. ఈ అందాల ఆరబోతతోనే మరిన్ని అవకాశాలు అందుకోవాలని చూస్తుంది. మరి ఈ ముద్దుగుమ్మ కోరికను మన ఇండస్ట్రీలో ఏ దర్శకుడైనా పట్టించుకుంటాడో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here