Home Movie News నాని ఫుల్ కాన్పిడెంట్….కానీ…

నాని ఫుల్ కాన్పిడెంట్….కానీ…

0
SHARE
Nani Interview Photos | telugu.itsmajja.com

హీరో నాని జెర్సీ సినిమా విషయంలో బాగా ఎగ్జైట్ అవుతున్నాడు. ఇప్పటివరకు తాను ఇలాంటి సినిమా చేయలేదంటున్నాడు. ఓ అడుగు ముందుకేసి టాలీవుడ్ లో ఇంతటి ఎమోషన్ తో కూడుకున్న స్పోర్ట్ బ్యాక్ డ్రాప్ సినిమా రాలేదంటున్నాడు. ఈ సినిమా షూటింగ్ చేసిన చివరి రోజు బాగా ఎమోషనల్ గా ఫీలయ్యాడట. సినిమా ఆద్యంతం ఎంటర్ టైనింగ్ గా ఉంటూ… ఎమోషనల్ గా సాగే జర్నీ అంటున్నాడు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడట. దెబ్బలు కూడా బాగానే తగిలాయంటున్నాడు.

అయితే జెర్సీ సినిమాతో పాటు ఏప్రిల్ 19న కాంచన 3 కూడా రిలీజ్ అవుతోంది. లారెన్స్ రూపొందించిన ఈ చిత్రం కోసం మాస్ ఆడియెన్స్ వెయిట్ చేస్తున్నారు. దీంతో జర్సీ సినిమాకు త్రెట్ ఉండే అవకాశముందంటున్నారు. ఎందుకంటే కాంచన సిరీస్ లో వస్తున్న సినిమా కాంచన 3. ఈ సినిమాకు జెర్సీ మాదిరిగానే మంచి బజ్ ఉంది. జెర్సీ క్లాస్ ఆడియెన్స్ కోసం, కాంచన 3 మాస్ అడియెన్స్ కోసం అని లెక్కలేస్తున్నారు.

ఎవరెన్ని లెక్కలేసినా… సినిమా బాగుంటే మాస్ క్లాస్ అనే తేడా లేకుండా హిట్ చేసేస్తారు జనాలు. అందుకే నాని ప్రీ రిలీజ్ టాక్ ని అస్సలు పట్టించుకోవట్లేదు. సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందనే ధీమా వ్యక్తం చేస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here