Home Reviews NGK మూవీ రివ్యూ

NGK మూవీ రివ్యూ

0
SHARE
NGK Movie review | telugu.itsmajja.com

సూర్యకు గతంలో తెలుగు మార్కెట్ చాలా ఎక్కువగా ఉండేది. ఆయన సినిమా వస్తుందంటే చాలా బజ్ ఉండేది. కానీ ఆయన నటించిన చిత్రాలు వరుసగా పరజయాలు కావడంతో క్రేజ్ తగ్గుతూ వస్తోంది. తాజాగా ఆయన నటించిన ఎన్ జి కె విడుదలైంది. కానీ పెద్దగా బజ్ లేకుండానే సైలెంట్ గా రిలీజ్ అయ్యింది. అనుకున్నంత స్థాయిలో ఓపెనింగ్స్ కూడా రాలేదు. అలాంటి ఎన్ జి కె చిత్రానికి దర్శకుడు సెల్వ రాఘవన్. సాయి పల్లవి, రకుల్ ప్రీత్ హీరోయిన్స్. మరి ఈ సినిమాతో తనకున్న స్టార్ డమ్ ను కొసాగిస్తాడా లేదా అన్నది సమీక్షలో చూద్దాం.

కథేంటంటే…
నంద గోపాల్ ఎన్.జి.కె ఎం.టెక్ చదివి ఆర్గానికి వ్యవసాయం చేయాలనుకుంటాడు కానీ రాజకీయ నాయకుల నుంచి  బెదిరింపులు వస్తాయి. సోషల్ యాక్టివిస్ట్ లో ఊర్లో వాళ్లకు ఏమైనా సాయం కావాలంటే చేస్తుంటాడు. అలా ఆనుకోకుండా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తాడు.   ప్రజలకు మంచి చేయాలన్నా, వ్యవస్థలను శాసించాలన్నా రాజకీయ నాయకుల వల్లే అవుతుందని గ్రహించి, ప్రతిపక్ష పార్టీ లోకల్ ఎమ్మెల్యే దగ్గర కార్యకర్తగా జాయిన్ అవుతాడు. ఆలా అనుకోకుండా పార్టీలో చేరతాడు. సామాన్య కార్యకర్తగా చేరిన నందగోపాల్ ముఖ్యమంత్రి ఎలా అయ్యాడు. అతనికి ఎదురైన ప్రతికూల అనుకూల పరిస్థితులు ఎలాంటివో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

సమీక్ష
సెల్వ రాఘవన్ సినిమాలు చాలా కాంప్లికేటెడ్ గా ఉంటాయి. అయితే ఈ సినిమా అంత కాంప్లికేటెడ్ కథేం కాదు. కానీ దర్శకుడు తెరకెక్కించిన విధానమే కాంప్లికేటెడ్ గా అనిపిస్తుంటుంది. తల తోక లేని సీన్స్ తో కథ వెళ్తుంది. దర్శకుడు ఓ దగ్గర మొదలు పెట్టి ఎటెటో వెళ్తాడు. సూర్య క్యారెక్టరైజేషన్ నిజానికి మంచిదే. కానీ పాత్రను ఎలివేట్ చేసేందుకు కావాల్సిన సీన్స్ మాత్రం రాసుకోలేకపోయాడు. సీన్స్ చాలా ప్లెయిన్ గా వెళ్తుంటాయి. కొన్ని ఎమోషన్స్ సీన్స్ పరవాలేదనిపించినా…. కథలో కొత్తదనం లేకపోవడంతో ఇంట్రస్టింగ్ గా అనిపించవు. ఇక సాయి పల్లవి పాత్రను ఎందుకు అలా తీర్చిదిద్దాడో అర్థం కాదు. మొగుడిని అనుమానపడే పాత్రలో నటించింది. ఆమె క్యారెక్టరైజేషన్ ను తీర్చిదిద్దిన విధానం అస్సలు బాగా లేదు. రకుల్ క్యారెక్టర్ కాస్త ఎక్కువే ఉన్నప్పటికీ….  పెద్దగా ప్రయోజనం లేని పాత్ర. సూర్యను ఇష్టపడుతుంది. కానీ ఇష్టాన్ని సరిగ్గా చూపించనే లేదు. కామంగా చూపించారు తప్ప.

సెల్వ రాఘవన్ కథ, కథనం సరిగ్గా రాసుకోవడంలో విఫలమయ్యాడు. సూర్య లాంటి స్టార్ హీరో సినిమాను ఈ రకంగా తెరకెక్కిస్తాడని ఎవ్వరూహించరు. స్లో నరేషన్ తో కథనం ఉంటుంది. చాలా సీన్స్ బోరింగ్ గా సాగుతుంటాయి.  పాటలు పెద్దగా ఆకట్టుకోవు. నిర్మాణాత్మక విలువలు ఓకే. పొలిటికల్ సినిమా అన్నప్పుడు కనీసం డైలాగ్స్ అయినా హైలైట్ గా ఉండాలి. కానీ డైలాగ్స్ కూడా సరిగ్గా రాయలేకపోయారు. సాధారణ కార్యకర్త సీఎంగా ఎదిగిన విధానం సరిగ్గా ఉండదు. పెద్దగా ట్విస్టులు కనిపించవు. కనీసం కామెడీ అయినా పెట్టి ఉంటే బాగుండేది. కానీ అది కూడా లేదు. నంద గోపాల్ సీఏం అయిన విధానం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఇంత సింపుల్ గా సీఎం అవ్వొచ్చా అనిపిస్తుంది.

ఓవరాల్ గా….
ఎన్ జి కె పైనా పెట్టుకున్న అంచనాలు తలకిందులు అయినట్టే. ఎందుకంటే సూర్య సినిమా అంటే కాస్తో కూస్తో విషయం ఉంటుందనుకుంటాం. కానీ ఎన్ జి కె లో విషయం పెద్దగా ఇంట్రస్టింగ్ గాలేదు. సో ఎన్ జి కె ను స్కిప్ చేయడం బెటర్.

Rating : 2/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here