Home Reviews ఎన్టీయార్ – కథానాయకుడు మూవీ రివ్యూ

ఎన్టీయార్ – కథానాయకుడు మూవీ రివ్యూ

0
SHARE
NTR Biopic Review | telugu.itsmajja.com

Rating : 3/5

నందమూరి తారక రామారావు బయోపిక్ తీయాలనుకున్నప్పుడే ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి వెళ్లాయి. అందునా బాలకృష్ణ నటిస్తూ నిర్మించిన చిత్రమిది. పొలిటికల్ గా హీట్ పెరుగుతున్న సమయంలో వస్తున్న సినిమా కావడం కూడా ఈ సినిమాపై ప్రాధాన్యం సంతరించుకుంది. క్రిష్ ఈ చిత్రానికి దర్శకుడు. విద్యాబాలన్ బసవతారకం పాత్రలో నటించింది. ఈ సినిమాలో మనకు తెలిసిన చాలామంది నటీనటులు కనిపించారు. మరి అటు సినీ, ఇటు రాజకీయ రంగాలు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఈసినిమా ఎలా ఉంది. రియల్ లైఫ్ లో ప్రజాదరణ పొందిన ఎన్టీయార్ ను… బయోపిక్ సినిమా ద్వారా ప్రేక్షకాదరణ పొందిందా లేదా అన్నది చూద్దాం.

 

కథేంటంటే… 

కథగా చెప్పుకుంటే ఈ సినిమాలో ఎన్టీయార్ పర్సనల్ లైఫ్ ని ఇటు సినిమా లైఫ్ ని క్రిష్ బ్యాలెన్స్ చేస్తూ వచ్చాడు. రిజిస్ట్రార్ గా పనిచేస్తున్న ఎన్టీయార్ (బాలకృష్ణ0 సినిమా రంగంలోకి ఎలా ప్రవేశించాడు. అక్కడ ఎదుర్కొన్న పరిస్థితులు. స్టార్ గా ఎలా ఎదిగాడు. ఫ్యామిలీ లైఫ్ ని ఎలా డీల్ చేశాడు. అక్కినేని నాగేశ్వరరావు (సుమంత్) తో స్నేహం…. ప్రజల కోసం పనిచేసిన విధానం. నిర్మాతగా మారడం…. అటునుంచి రాజకీయాల్లోకి ఎలా వెళ్లాడన్నది కథానాయకుడులో చూపించారు. ఇక ఎలా చేశారు అన్నది మాత్రం థియేటర్లోనే చూడాలి.

 

 

సమీక్ష

బాలకృష్ణ నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పక్కాగా ఎన్టీయార్ లుక్ లో లేకపోయినప్పటికీ చాలా సీన్స్ లో ఎన్టీయార్ ను తలపించేలా నటించారు. మేకప్ తో బాగానే మేనేజ్ చేయగలిగారు. ఎన్టీయార్ పాత్ర, బసవతారకం (విద్యాబాలన్) పాత్రల మధ్య వచ్చే సన్నివేశాలు బాగున్నాయి. ఏ ఎన్నా ఆర్ తో స్నేహాన్ని కూడా బాగా చూపించారు. దివిసీమ ఉప్పెన, రాయలసీమ క్షామం కోసం తన వంతుగా ఏం చేశాడన్నది బాగా చూపించారు. ఈ సందర్భంలో వచ్చే ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్ కు ఎలా వచ్చిందో టచ్ చేశారు. ఎన్టీయార్ పాత్రలో ఒదిగేందుకు బాలకృష్ణ పడిన శ్రమను మెచ్చుకోవాల్సిందే. ఇక నాగేశ్వరరావు పాత్రలో సుమంత్ నటన బాగుంది. అలాగే విద్యాబాలన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎక్కువ సీన్స్ లేకపోయినప్పటికీ నటనా పరంగా మార్కులు కొట్టేసింది. కృష్ణుడి ఎపిసోడ్ బాగుంది. రావణుడి పాత్ర కోసం ఆయన పడ్డ కష్టాన్ని బాగా చూపించారు. దర్శకుడు క్రిష్ చాలా విషయాల్లో బాగా కేర్ తీసుకున్నాడు. కేవలం సినిమా సీన్స్ పెట్టి లాగించకుండా పర్సనల్ లైఫ్ లోని ముఖ్యాంశాల్ని టచ్ చేసుకుంటూ వెళ్లాడు. ఓవరాల్ గా దర్శకుడు క్రిష్ తనకిచ్చిన పనిని సక్రమంగానే నిర్వర్తించాడనిపించింది.

 

అయితే ప్రేక్షకులు మాత్రం బసవతారకం ఎన్టీయార్ జీవితంలో జరిగిన ముఖ్య సంఘటనల్ని ఆవిష్కరిస్తారని ఆశించారు. ఆ విషయంలో బాగా డిసప్పాయింట్ అవుతారు. చాలా విషయాలు జనాలకు తెలిసినవే ఎస్టాబ్లిష్ చేశారనిపించింది. స్లో నరేషన్ కూడా కాస్త ఇబ్బంది పెట్టే పరిణామమే. కొన్ని సీన్స్ కృతకంగా సాగదీసినట్టుగా అనిపిస్తాయి. టెక్నికల్ గా మ్యూజిక్ విషయంలో కీరవాణి ఓకే అనిపించారు. జ్ఞానశేఖర్ కెమెరా వర్క్ బాగుంది. బ్లాక్ అండ్ వైట్ కలర్స్ లో అప్పటి పరిస్థితుల్ని ఎస్టాబ్లిష్ చేయగలిగాడు. డైలాగ్స్ పరంగా సాయి మాధవ్ సక్సెస్ ఆయ్యాడు. ఠక్కున గుర్తు పెట్టుకునే డైలాగ్స్ లేకపోయినా…. సన్నివేశాల పరంగా బాగున్నాయి.

 

ఈ తరహా సినిమాలు తీయడం చాలా కష్టమైన పని. ఈ తరహా సినిమాలతో ప్రేక్షకుల్ని పూర్తిగా సంతృప్తి పరచడం కూడా కష్టమైన పనే. ఆ సవాలను బాగానే స్వీకరించి… పూర్తిగా కాకపోయినా సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు. ప్రేక్షకులు ఆశించిన అంశాలు కూడా ఉండి ఉంటే ఇంకా బాగుండేది. ఏది ఏమైనా ఓసారి చూడదగ్గ చిత్రం.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here