Home Reviews ఎన్టీయార్ మహానాయకుడు మూవీ రివ్యూ

ఎన్టీయార్ మహానాయకుడు మూవీ రివ్యూ

0
SHARE
NTR Mahanayakudu Movie Review | telugu.itsmajja.com

Rating : 2.5/5

ఎన్టీయార్ బయోపిక్ గా వచ్చిన రెండో పార్ట్ మహానాయకుడు. ఎన్టీయార్ బయోపిక్ లో భాగంగా వచ్చిన మొదటి పార్ట్ ఎన్టీయార్ కథానాయకుడు ప్రేక్షకుల్ని మెప్పించడంలో విఫలమైంది. దీంతో రెండో పార్ట్ తో అయినా ప్రేక్షకుల్ని మెప్పిస్తారనే ఆశతో ప్రేక్షకులున్నారు. రెండో భాగంలో ఆయన రాజకీయ జీవితాన్ని ప్రతిబింబించేలా ఉంటుందని ముందే చెప్పారు. మరి ఈ సినిమా పెద్దగా అంచనాలు లేకుండానే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.

 

కథేంటంటే… ఈ సినిమాలో ఎన్టీయార్ ముఖ్యమంత్రి పీఠం ఎలా ఎక్కాడు. చైతన్య రథంతో వెళ్లి ఎలా ప్రచారం చేశాడు. ఆ తర్వాత నాదెండ్ల భాస్కరరావు ఎన్టీయార్ ను ఎలా గద్దె దించాడు. ఆయన్ను గద్దె దించడంలో ఇందిరాగాంధి పాత్ర ఎంత. మళ్లీ ఎన్టీయార్ ను ముఖ్యమంత్రిని చేసేందుకు నారా చంద్రబాబు నాయుడు వేసిన ఎత్తుగడలేంటి. తారకం క్యాన్సర్ తో ఎలా చనిపోయిందనే విషయాల గురించి మెయిన్ ఫోకస్ చేశారు. మరి ఈ సినిమాను ఎలా చూపించారో చూద్దాం.

 

సమీక్ష

సినిమా టైటిల్స్ లో ఫస్ట్ పార్ట్ లో ఏం చూపించారో ఆ షాట్స్ వేసుకుంటూ వెళ్లారు. ఆ తర్వాత ఎన్టీయార్ పుట్టుక ఉద్యోగం వరకు చిన్న సీన్స్ తో చూపించారు. ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యేందుకు ఆయన చేసిన ప్రచారం చూపించారు. చైతన్య రథంలో కాఖీ బట్టలతో ఊరూరు ఎలా తిరిగారో చూపించారు. మరో వైపు కాంగ్రెస్ పార్టీ తప్పిన అంచనాల్ని ఇందిరాగాంధీ పాత్రలో చూపించారు. ఆ తర్వాత అంతర్గతంగా పార్టీలో చీలికలు మొదలవుతాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి నారా చంద్రబాబు నాయుడు ఓడిపోవడం ఆ తర్వాత రాజకీయాలకు కాస్త బ్రేక్ తీసుకోవడం మళ్లీ ఎన్టీయార్ దృష్టిలో పడడం తెలుగు దేశం పార్టీలో మంచి స్థానం ఇవ్వడం చూపించారు. ఆ తర్వాత పార్టీలో చీలికలు వచ్చి నాదెండ్ల వర్గం వేరవుతుంది. గవర్నర్ సాయంతో నాదెండ్ల ముఖ్యమంత్రి అవుతాడు. అటు నుంచి ఎన్టీయార్ ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతిని కలవడం. ఎమ్మోల్యేల్ని చంద్రబాబు ఎలా తప్పించుకోకుండా చూసుకోకుండా ఉన్నాడో చూపించారు.

 

ఇదంతా ఫస్టాఫ్ లో బోరింగ్ గా సాగుతుంది. ఎన్టీయార్ జీవితంలో ఎన్నో ముఖ్య ఘటనలు ఉన్నప్పటికీ చూపించిన విధానంతో ఇంతేనా అనిపిస్తుంది. స్టోరీ నరేషన్ మరీ స్లోగా సాగింది. గొప్ప సీన్స్ కనిపించలేదు, గొప్ప డైలాగ్స్ వినిపించలేదు. పై పెచ్చు సీరియల్ తరహా మేకింగ్ ప్రేక్షకుల సహనానికి పరీక్షగా ఉంటుంది. ముఖ్యంగా తారకం ఎన్టీయార్ మధ్య వచ్చే సీన్స్ మరీ నీరసంగా ఉంటాయి. ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేంత కంటెంట్ కనిపించదు. దర్శకుడు క్రిష్ పాత్ర ఎంతుందో బాలకృష్ణ పాత్ర ఎంతుందో గానీ ఎన్టీయార్ బయోపిక్ ని అనుకున్న విధంగా మలచడంలో పూర్తిగా విఫలమయ్యారు. సినిమాలో కొద్దిసేపు రాజకీయంగా జరిగే నాటకీయ పరిణామాలు కాస్త ఇంట్రస్టింగ్ గా అనిపించినా… ఓవరాల్ గా ప్రేక్షకులు కోరుకున్న విషయాల్ని పూర్తిగా విస్మరించారనిపించింది. ముఖ్యంగా నాదెండ్లను విలన్ గా చూపించారు. అంతే కాదు చంద్రబాబును హీరోగా చూపించారు. ఎన్టీయార్ ను ముఖ్యమంత్రిని చేసింది చంద్రబాబే అని చెప్పుకునేలా చిత్రీకరించారు. నిజా నిజాలు ఎంతున్నాయో, కల్పితాలు ఎన్నున్నాయో కానీ… సినిమా పరంగా మాత్రం సక్సెస్ కాలేకపోయారు. సెకండాఫ్ మరీ నాటకీయంగా మారుతుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ ని ఎస్టాబ్లిష్ చేయడంలో సక్సెస్ కాలేకపోయారు. ఈ సినిమాలో బాలకృష్ణ పాత్ర లేకుండా చేశారు.

 

అసెంబ్లీ సన్నివేశాలు మరీ కృతకంగా ఉన్నాయి. జరిగిన వాటినే సరిగ్గా చెప్పడంలో విఫలమయ్యారు. బాలకృష్ణ నటనా పరంగా మెప్పించినా… సచిన్ ఖేద్కర్ బాగా నటించాడనిపించింది. రానా ను మరీ సీరియస్ గా చూపించే ప్రయత్నం చేశారు. చంద్ర బాబు పాత్ర మాత్రం పెద్దగా కనిపించలేదు. సినిమాకు ఆయనే హీరో అని చెప్పాలి. విద్యాబాలన్ పెర్ ఫార్మ్ చేసేంత పెద్ద సీన్స్ ఏం కనిపించలేదు.

 

ఈ సినిమాను బయోపిక్ అనొచ్చో లేదో కూడా అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే బయోపిక్ లో సాధారణంగా జీవితం చివరిదాకా చూపిస్తారు. కానీ ఎన్టీయార్ మహానాయకుడిలో పొలిటికల్ జర్నీనే ఎస్టాబ్లిష్ చేశారు. రాజకీయాల్ని మెయిన్ ఫోకస్ చేశారు. తారకం చనిపోయే వరకు మాత్రమే చూపించి ఎండ్ చేశారు. ఏది ఏమైనా ఎన్టీయార్ కథానాయకుడు ప్రేక్షకుల్ని మెప్పించలేదు. చివరికి మహానాయకుడు కూడా అదే బాటలో మెప్పించడంలో సఫలం కాలేదు.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here