Home Reviews నువ్వు తోపురా మూవీ రివ్యూ…

నువ్వు తోపురా మూవీ రివ్యూ…

0
SHARE
Nuvvu Thopu Raa Movie review | telugu.itsmajja.com
Rating : 2/5
సుధాకర్ కొమకుల లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు పూర్తి స్థాయి హీరోగా నువ్వు తోపురా అనే సినిమా చేశాడు. ఈచిత్రంట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. పాటలు కూడా బాగున్నాయి. దీంతో ఈ సినిమా ఎలా ఉంటుందో అనే ఆసక్తి పెరిగింది. హరినాథ్ బాబు దర్శకుడు. శ్రీకాంత్ దాడువై నిర్మాత.  మరి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.
కథేంటంటే…
సూరి (సుధాకర్) హైదారాబాద్ కుర్రాడు. సరూర్ నగర్ లో ఉంటాడు. బీటెక్ సగంలోనే వదిలేస్తాడు. తండ్రి చనిపోవడం… తల్లి ఆఫీస్ పనితో బిజీ కావడంతో ఆవారాగా పెరుగుతాడు. స్నేహితులతో కలిసి సరదాగా గడిపేస్తుంటాడు. ఇలాంటి సమయంలో రమ్య (నిత్యా శెట్టి) ను చూసి ఇష్టపడతాడు. ఆమె ప్రేమను సంపాదిస్తాడు. అయితే రమ్య తల్లి తండ్రుల దగ్గర తన బిహేవియర్ తో పరువు తీసుకుంటాడు. ఇలాంటి టైంలో రమ్య తనతో పాటు అమెరికా వచ్చేందుకు ఎగ్జామ్స్ ఫినిష్ చేయమంటుంది. కానీ సూరి పట్టించుకోడు. దీంతో రమ్య సూరి దూరమౌతారు. రమ్య అమెరికా వెళ్తుంది. ఆ తర్వాత ఆనుకోకుండా ఓ కల్చరల్ ఈవెంట్ కోసం అమెరికా వెళ్తాడు. అక్కడ తనకు అనేక అనుభవాలు ఎదురౌతాయి. బతకడం కష్టమౌతుంది. అమ్మకు ఆరోగ్యం చెడిపోతుంది. డబ్బులు అవసరమౌతాయి. గ్రీన్ కార్డ్ కోసం డబ్బులు కావాల్సి వస్తుంది. ఇదే సమయంలో డ్రగ్స్ దందాలోకి ఎంటర్ అవుతాడు.
ఇంతకూ రమ్య సుధాకర్ ను ఎందుకు దూరం చేసుకుంది. అమెరికాలో వీరిద్దరు కలుసుకున్నారా. అమెరికాలో తన లైఫ్ ఎలా సాగింది. డ్రగ్స్ మాఫియాలోకి సుధాకర్ ఎలా ఎంటర్ అయ్యాడు. అయ్యాక ఏం జరిగిందనేది అసలు కథ.
సమీక్ష
డైరెక్టర్ సూరి క్యారెక్టర్ ను బాగానే డిజైన్ చేశాడు. రవితేజ గతంలో చేసిన కొన్ని పాత్రల్ని గుర్తుకు తెస్తుంది. సూరి గెటప్ లుక్స్ మాస్ గా ఉంటాయి. పక్కా తెలంగాణ యాసలో మాట్లాడుతాడు. ఈ క్యారెక్టరైజేషన్ పూరీ సినిమాల్లో కూడా కనిపిస్తుంటుంది. ఈ క్యారెక్టర్ కి సుధాకర్ బాగానే కుదిరాడు. కథను తన భాజాల మీదేసుకొని నడిపించేందుకు ట్రై చేశాడు. ఇక హీరోయిన్ పాత్ర సినిమా ప్రారంభంలోనే ఎక్కువగా ఉంటుంది. లవ్ బ్రేకప్ తర్వాత హీరోయిన్ కనిపించదు. మళ్లీ క్లైమాక్స్ పార్ట్ లో వస్తుంది. హీరోయిన్ గా ఓకే. పెద్దగా పెర్ ఫార్మ్ చేసేందుకు స్కోప్ లేదు. సర్ ప్రైజింగ్ గా వరుణ్ సందేశ్ ఇందులో హీరో ఫ్రెండ్ పాత్రలో కనిపించాడు. సినిమాలో చాలా సేపే కనిపించాడు. కానీ ఈ క్యారెక్టర్ ఎందుకు చేశాడో అర్థం కాదు. అంత పెద్ద ఇంపార్టెంట్ క్యారెక్టర్ కూడా కాదు. నిరోష హీరో తల్లి పాత్రలో ప్రామిసింగ్ రోల్ ప్లే చేసింది.
అమెరికాలో నటించిన ఇంగ్లిష్ బ్యాచ్ కూడా బాగా చేశారు.
దర్శకుడు లైన్ వరకు బాగానే రాసుకున్నప్పటికీ… కొన్ని సన్నివేశాల్ని బాగానే డీల్ చేసినప్పటికీ… పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయాడు. సినిమా ప్రారంభం చాలా రెగ్యులర్ గా అనిపిస్తుంది. ఏదీ పూర్తి స్థాయిలో శాటిస్ ఫై చేయలేకపోయాడు. సెకండాఫ్ లో అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు బాగున్నప్పటీకీ.. అదే ఫేజ్ లో సినిమా వెళ్లదు. చాలా సార్లు సినిమా పూర్తిగా డ్రాప్ అయ్యింది. సినిమా ఓవర్ లెంగ్త్ అనిపిస్తుంది. ఈ తరహా సినిమా స్పీడ్ గా ఉంటే బాగుంటుంది. కానీ చాలా నీరసంగా వెళ్తుంది. కంటెంట్ తగ్గ స్పీడ్ సినిమాలో కనిపించలేదు. స్టోరీ చాలా సార్లు సైడ్ ట్రాక్ కి వెళ్లింది. చాలా సార్లు ఇండియాని పొగడడానికి అమెరికాని తిట్టడానికే సినిమా తీసినట్టుంది. సీన్స్ ని బలంగా రాసుకోలేదు. హీరో హీరోయిన్ బ్రేకప్ సీన్ తేలిపోయింది. బలమైన కారణాలు చూపించి ఉంటే ఇంకా స్ట్రాంగ్ గా ఉండేది. కొన్ని డైలాగ్స్ బాగానే రాసుకున్నాడు. దానికి తగ్గట్టుగా సన్నివేశాలు కూడా పడి ఉంటే బాగుండేది. అమెరికాలో సీన్స్ చాలా లైటర్ వెయిన్ లో వెళ్లాయి. స్లో నరేషన్ ప్రేక్షకులకు బోర్ కొట్టిస్తుంది. వరుణ్ సందేశ్ హీరోగా సక్సెస్ లు కొట్టాడు. అలాంటి వ్యక్తి రీ ఎంట్రీ బాగుండాలి. కానీ ప్రాధాన్యం లేని పాత్రను వరుణ్ కి ఇచ్చారు. వరుణ్ కూడా ఆ పాత్రను ఎందుకు ఒప్పుకున్నాడో కూడా అర్థం కాదు. హీరోగా చేసిన వ్యక్తి హీరో ఫ్రెండ్ పాత్రలో నటించడం అర్థం కాని విషయం. క్లైమాక్స్ మరీ వీక్ గా ఉంది. హీరో అంతా చేసి ఊస్సూరుమనిపించాడు. ఏదో ఓ సక్సెస్ సాధించిన ఫీలింగ్ మాత్రం ప్రేక్షకులకు అనిపించదు. సురేష్ బొబ్బిలి సంగీతం పరవాలేదు. పాటలు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. కెమెరా వర్క్ బాగుంది.ముఖ్యంగా అమెరికా అందాల్ని బాగా క్యాప్చర్ చేశారు. ఎడిటింగ్ ఓవర్ లెంగ్త్ లో ఉంది. నిర్మాతలు సినిమాను ఇంకా ప్రమోట్ చేయాల్సింది.
ఓవరాల్ గా….
నువ్వు తోపురా అనే టైటిల్ కు తగ్గ కంటెంట్ సినిమాలో కనిపించలేదు. కొన్ని సీన్స్, కొన్ని డైలాగ్స్ పక్కన పెడితే… పెద్దగా ఆసక్తి కలిగించే సీన్స్ లేవు. స్క్రీన్ ప్లే పరంగా చాలా వీక్ గా అనిపిస్తుంది. కామెడీ అస్సలు లేదు. ఈ తరహా చిత్రాలకు అదే పెద్ద పీట వేయాలి. కానీ కామెడీని దర్శకుడు వదిలేశాడు. సో… పెద్దగా పట్టించుకునేంత సినిమా కాదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here