Home Reviews పేట మూవీ రివ్యూ

పేట మూవీ రివ్యూ

0
SHARE
Petta Movie Telugu Review | telugu.itsmajja.com
Rating : 2.75/5
రజనీకాంత్ కాలా, కబాలి, రోబో 2 చిత్రాలు ప్రేక్షకుల్ని డిసప్పాయింట్ చేశాయి. కలెక్షన్స్ పక్కన పెడితే కంటెంట్ పరంగా ఆశించనంతగా ఎంటర్ టైన్ చేయలేకపోయాయి. దీంతో పేట మీదే ఆశలన్నీ పెట్టుకున్నారు ఆయన అభిమానులు. అందుకే గ్యారెంటీ హిట్ ఇవ్వగలడనుకున్నకార్తీక్ సుబ్బరాజును డైరెక్టర్ గా ఎంచుకున్నారు. అనిరుధ్ సంగీతం అందించాడు. సిమ్రాన్, త్రిష, నవాజుద్దీన్ సిద్దిఖీ, బాబీ సింహా, విజయ్ సేతుపతి కీలక పాత్రలు పోషించారు. మరి ఈ సినిమా ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పించిందో చూద్దాం.
కథేంటంటే:
కాళీ (రజని కాంత్) హాస్టల్ వార్డెన్. తాను పనిచేసే కాలేజ్ లో చదువుకుంటున్న ఓ ప్రేమ జంటకు హెల్ప్ చేస్తాడు. అలాగే అక్కడ అరాచకాలు చేస్తున్న బాబీ సింహా ను ఎదిరిస్తాడు. ఓ రోజు అనకోకుండా ఓ ఎటాక్ జరుగుతుంది. ఆ ఎటాక్ ఎవరు చేశారా అని ఆరా తీస్తే… ఉత్తరప్రదేశ్ లో ఉండే సింహాచలం (నవాజుద్దీన్ సిద్దిఖీ), అతని కొడుకు జిత్తు ( విజయ్ సేతుపతి) చేయించారని తెలుస్తుంది. దీంతో వారి ఆగడాల్ని అరికట్టేందుకు ఉత్తరప్రదేశ్ కు వెళ్తాడు కాళీ. ఇంతకూ సింహాచలంకు కాళీకి గొడవేంటి. స్టూడెంట్ ను చంపేందుకు సింహాచలం మనుషుల్ని ఎందుకు పంపించాడు. కాళీ గతమేంటి. అతని పగేంటి. ఇలాంటి విషయాలు తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే.
సమీక్ష
ఇది పక్కా రజనీకాంత్ మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్. గత మూడు చిత్రాల్లో రజనీకాంత్ నుంచి ఫ్యాన్స్ ఏం మిస్ అయ్యారో ఆ అంశాల్ని జోడించి రూపొందించిన చిత్రమిది. ప్రతీ ఫ్రేమ్ లోనూ రజని ని ఎస్టాబ్లిష్ చేసేందుకు, బిల్డప్ షాట్స్ తో ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేసేందుకు ట్రై చేశారు. ఫస్టాఫ్ అంతా సరదాగా సాగిపోతుంది. ఎప్పుడైతే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మొదలవుతుందో కొత్త సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. సినిమా బాగానే ఉందనిపిస్తున్నా… రెగ్యులర్ గా మనం చూసే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కావడంతో పెద్దగా కిక్ అనిపించదు. క్లైమాక్స్ ట్విస్ట్ అదిరిపోయింది. ఓవరాల్ గా దర్శకుడు కార్తీక్ పాసయ్యాడు. రజనీకాంత్ ను ఎలా చూపించాలనుకున్నాడో అలాగే ఎస్టాబ్లిష్ చేసాడు. స్క్రీన్ ప్లే బాగా రాసుకున్నాడు.
ముఖ్యంగా యాక్షన్ పార్ట్ ని బాగా డిజైన్ చేశారు. అలాగే రజనీ మార్క్ డైలాగ్స్ విజిల్స్ వేయిస్తాయి. రజనీ చాలా స్టైలిష్ గా ఎనర్జిటిక్ గా కనిపించాడు. డ్యాన్సులు ఫైట్స్ ఇరగదీశాడు. విజయ్ సేతుపతి కీలక పాత్రలో కనిపించాడు. సిమ్రాన్, త్రిష వి చిన్న క్యారెక్టర్లే. బాబీ సింహా ఫస్టాఫ్ లో చాలా సేపు ఉంటాడు. సెకండాఫ్ లో నవాజుద్దీన్ సిద్దిఖీ ఇరగదీశాడు. దర్శకుడు కార్తీక్ ఎమోషనల్ గా యాక్షన్ ప్యాక్ డ్ సినిమాగా మలచడంలో సక్సెస్ అయ్యాడు. కామెడీని కూడా జాగ్రత్తగా డీల్ చేశాడు. అనిరుథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొత్తగా ఉంది. పాటలు ఓకే. సినిమాటోగ్రఫీ బాగా ప్లస్ పాయింట్ అయ్యింది. లైటింగ్ స్పెషల్ గా ఉంది. బిల్డప్ షాట్స్ బాగున్నాయి.
అయితే ఫస్టాఫ్ ను బాగానే లాగించిన దర్శకుడు సెకండాఫ్ లో రెగ్యులర్ ప్యాటర్న్ రివెంజ్ ఫ్లాష్ బ్యాక్ డ్రామా ఓపెన్ చేశాడు. ఇది రెగ్యులర్ గా ఉండడం బోరింగ్ అంశం. అక్కడక్కడ మెరుపులు ఉన్నప్పటికీ…. ఫస్టాఫ్ లో వచ్చింత కిక్ సెంకడాఫ్ కి వచ్చేసరికి తగ్గింది. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ అదిరింది. కాస్త నెమ్మిదించిన సీన్స్ తో గ్రాఫ్ పడిపోయింది. విలన్ ను సింపుల్ గా చంపేయడం ప్రేక్షకులు జీర్ణించుకోలేరు. సిమ్రాన్, రజనీ లవ్ ట్రాక్ కి  మంచి ముగింపు ఇవ్వలేకపోయాడు. తమిళ నేటివిటీ ఎక్కువగా ఉంటుంది.
ఓవరాల్ గా ఇది… ఇది ఫక్తు రజనీకాంత్ సినిమా. రజనీకాంత్ నుంచి కొన్నేళ్లుగా ఏమేం మిస్ అయ్యారని ఫీలవుతున్నారో వాటిని ఇందులో చూడొచ్చు. సెకండాఫ్ విషయంలో కాస్త జాగ్రత్త పడి ఉంటే ఇంకా బాగుండేది. పూర్తిగా అయితే డిసప్పాయింట్ మాత్రం కారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here