Home Movie News పూనమ్ కౌర్ కంప్లైంట్ ఎవరి మీద….

పూనమ్ కౌర్ కంప్లైంట్ ఎవరి మీద….

0
SHARE
poonam kaur | telugu.itsmajja.com

టాలీవుడ్ లో హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటించిన పూనమ్ కౌర్… తనను మాససికంగా వేధిస్తున్న సోషిల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ మీద కంప్లైంట్ ఇచ్చింది. గత కొంత కాలంగా తనను కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ వీడియోల ద్వారా వేధిస్తున్నారనేది ఆమె చేస్తున్న ప్రధాన అభియోగం. రాజకీయ లబ్దికోసం ఓ అమ్మాయి జీవితాన్ని పాడు చేయడం కరెక్ట్ కాదని పూనమ్ కంప్లైంట్ ఇచ్చింది. అయితే తనకు కొంతమంది మీద అనుమానాలున్నాయని వారి పేర్లను పోలీసులకు చెప్పానని అంటోంది. వారి వివరాల్ని బహిరంగంగా మీడియా ముందు మాత్రం చెప్పలేనని అంటోంది.

గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఓ ఆడియో సంచలనంగా మారింది. పూనమ్ కౌర్ అందులో ఎవరితోనో మాట్లాడుతున్న ఆడియో అది. అందులో ఆమె పవన్ ను, త్రివిక్రమ్ పేర్లను ఉపయోగించింది. తనకు అన్యాయం జరిగిందని ఆ ఆడియోలో వాపోయింది. ఈ ఆడియో సంచలనం రేకెత్తించింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పూనమ్ గురించి వ్యతిరేకంగా గళమెత్తారు. అయితే ఇన్నాళ్లకు పూనమ్ కంప్లైంట్ ఇవ్వడం చర్చనీయాశంగా మారింది. తనకు జరిగిన అన్యాయం మరే అమ్మాయికి జరగకూడదనేది పూనమ్ రిక్వెస్ట్.

ఇంతకూ పూనమ్ ఎవరి మీద కంప్లైంట్ ఇచ్చింది. అసలు తనకు జరిగిన అన్యాయం ఏంటి. జనాలు అనుకుంటున్నట్టుగా పవన్ కళ్యాణ్, ఆయన అభిమానుల గురించి కంప్లైంట్ లో చెప్పిందా… ఇలాంటి విషయాలు మాత్రం పోలీసు విచారణలోనే బయటికి వచ్చే అవకాశం ఉంది. చూడాలి పూనమ్ కంప్లైంట్ ఎంతవరకు వెళ్తుందో.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here