Home Movie News మహేష్ క్యాన్సిల్ చేశాడుగా….

మహేష్ క్యాన్సిల్ చేశాడుగా….

0
SHARE
Maharshi trailer | telugu.itsmajja.com

మహర్షి గురించి బయట టాక్ ఎలా ఉన్నా మహేష్ బాబు  పట్టించుకోవట్లేదు. సినిమాకు డివైడ్ టాక్ వచ్చినప్పటికీ… ఎపిక్ బ్లాక్ బస్టర్ అనే ఫీలింగ్ తీసుకొచ్చేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నాడు. దీనికోసం ఫ్యామిలీతో వెళ్లాల్సిన హాలిడే ట్రిప్ ను క్యాన్సిల్ చేసుకున్నాడట. తాను నటించిన సినిమా రిలీజ్ అయిన వెంటనే హాలిడే టూర్ కి వెళ్లడం మహేష్ కు అలవాటే. కానీ… ఈసారి ఆ టూర్ ను కొద్దిరోజులు పోస్ట్ పోన్ చేసుకుంటున్నాడట. మహర్షి కలెక్షన్స్ ని పెంచేందుకే మహేష్ ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది.

మహర్షి కలెక్షన్స్ అమెరికాలో దారుణంగా ఉన్నాయి. ఎంటర్ టైన్ మెంట్ లేకపోవడంతో ఓవర్సీస్ జనాలు సరిగ్గా ఆదరించట్లేదు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఇంప్రెసివ్ గానే ఉన్నప్పటికీ… అనుకున్నంత రేంజ్ లో మాత్రం లేవు. అంతేకాదు.. రోజు రోజుకు బాగా తగ్గుతున్నాయి. సినిమాకు అయిన బడ్జెట్ కు కలెక్షన్స్ కు ఏమాత్రం పొంతన కుదరట్లేదు. దీంతో సినిమాను అగ్రెసివ్ గా ప్రమోట్ చేయాలని అనుకున్నారట. దీనికోసం మహేష్ బాబుతో పబ్లిసిటీని పెంచాలని ట్రై చేస్తున్నారు. నైజాంలో నాన్ బాహుబలి రికార్డ్స్ బద్దలు కొట్టింది. అయితే ఓవరాల్ గా 100 కోట్ల షేర్ చేస్తుందా లేదా అన్నదే ప్రశ్న. ఇప్పుడు దీనికోసమే మహేష్ పరుగెత్తుతున్నాడు. చూడాలి… మహేష్ తాను అనుకున్న టార్గెట్ రీచ్ అవుతాడా లేదా అన్నది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here