Home Reviews ప్రేమ కథా చిత్రమ్ 2 మూవీ రివ్యూ

ప్రేమ కథా చిత్రమ్ 2 మూవీ రివ్యూ

0
SHARE
Prema Katha Chitram 2 review | telugu.itsmajja.com

Rating : 1.5/5

ప్రేమ కథా చిత్రమ్ హార్రర్ కామెడీ జోనర్ లో ట్రెండ్ సెట్ చేసింది. ఆ సినిమా చేసిన హల్ చల్ అంతా ఇంతా కాదు. ఆ తర్వాత చాలా సినిమాలు ఆ జోనర్ లో తెరమీదకు వచ్చాయి. ఇక ఇప్పుడు దీనికి కొనసాగింపుగా ప్రేమ కథా చిత్రమ్ 2 రూపొందించారు. సుమంత్ అశ్విన్, సిద్ది అద్నానీ నందిత శ్వేత కీలక పాత్రలు పోషించారు. హరి కిషన్ దర్శకుడు. సుదర్శన్ రెడ్డి నిర్మాత. మరీ హార్రర్ కామెడీ జోనర్ లో ఈ సినిమా ఎలాంటి ట్రెండ్ సెట్ చేసిందో చూద్దాం.

కథేంటంటే….

సుధీర్ (సుమంత్ అశ్విన్), బిందు (సిద్ధి ఇద్నాని) ఒకే కాలేజ్ లో చదువుకుంటారు. సుధీర్ అంటే సిద్ది కి చాలా ఇ్టం. తనని ప్రేమిస్తుంది. ప్రపోజ్ కూడా చేస్తుంది. కానీ సుధీర్ బిందు ప్రేమను నిరాకరిస్తాడు. తాను నందు (నందిత శ్వేత) అనే అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెబుతాడు. దీంతో సూసైడ్ అటెంప్ట్ చేస్తుంది. ఎలాగైనా సుధీర్ న దక్కించుకోవాలనుకుంటుంది. నందుని కూడా బెదిరిస్తుంది. సుధీర్ ని వదిలి వెళ్లిపోమని చెబుతుంది. దీనికి నందు ఒప్పుకోదు. అయితే అంతకు ముందు చిత్రతో సుధీర్ కు పెళ్లి కుదురుతుంది. కానీ చిత్ర కు చాలా మందితో సంబంధాలున్నాయని వదిలేస్తాడు. దీంతో సూసైడ్ చేసుకుంటుంది. ఇదిలా ఉంటే… ఫాం హౌస్ వెళ్లిన సుధీర్ ను బబ్లూను దెయ్యం భయపెడుతుంటుంది. ఇంతకూ ఆ దెయ్యం ఎవరు. ఆత్మ ఎవరు. ఎందుకు సుధీర్ ను బబ్లునూ భయపెట్టింది ఇలాంటి విషయాలు తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే.

సమీక్ష

హార్రర్ చిత్రాలు చాలానే వచ్చాయి. ప్రేమ కథా చిత్రం సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా హిట్టైనా.. ఈసినిమాలో కథా బలం లేదు. సీక్వెల్ చేయాల్సిన అవసరం లేని సినిమాకు ఓ కథ రాసుకున్నారు. దీంతో పేలవమైన స్క్రీన్ ప్లే తో బోర్ కొట్టించేశారు. అసలు దర్శకుడు ఏం చెప్పాలనకున్నాడో క్లారిటీ మిస్ అయ్యాడు. కనీసం ఒక్క సీన్ లోనూ భయపెట్టలేకపోయాడు. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అస్సలు లేవు. గ్రాఫిక్స్ చీప్ గా ఉన్నాయి. నిర్మాణాత్మక విలువలు అస్సలు లేవు. కాస్తలో కాస్త బల్కంపేట బబ్లూ కామెడీనే రిఫ్రెష్ మెంట్. జెబి మ్యూజిక్ ఓకే. రాం ప్రసాద్ లాంటి సీనియర్ కెమెరా మెన్ ఉన్నా పెద్దగా ప్రయోజనం లేదు.

సినిమా ప్రారంభం నుంచే సినిమా నీరసంగా ఉంటుంది హీరో యాక్టింగ్ అంతకంటే ఇంకా నీరసంగా ఉంది. కొద్దో గొప్పో నందత శ్వేత యాక్టింగ్ కోసం కష్టపడింది. సిద్దీ ఇద్నానీది పెద్ద క్యారెక్టరేం కాదు. ఆమెకు పెద్దగా ఉపయోగపడే సినిమా కానే కాదు. సుమంత్ అశ్విన్ ఏదో నటిద్దాంలే అన్నట్టుగా నటించాడు. ఇక డైరెక్టర్ కథ మీద అస్సలు కాన్సట్రేట్ చేయలేదు. పాత చింతకాయ పచ్చడి కథనే అటు ఇటుగా మార్చాడు. స్క్రీన్ ప్లే పరంగానూ మ్యాజిక్కులు లేవు. బబ్లు విద్యుల్లేఖ మధ్య వచ్చే సీన్స్ కాస్త సరదాగా ఉంటాయి. మిగిలినదంతా సోది అనిపిస్తుంది. క్లైమాక్స్ పార్ట్ లో సుమంత్ అశ్విన్ దెయ్యంగా మారే సన్నివేశం అయితే మరీ కృతకంగాఉంది. సుమంత్ కు అస్సలు యాక్టింగ్ రాదా అన్నట్టుగా నటించాడు. షార్ట్ ఫిలింస్ అద్భుతంగా తీస్తున్న తరుణంలో కథా బలం లేని, ఈ సినిమా చేయాలనుకోవడమే పెద్ద పొరపాటు.

ఫైనల్ గా…

ఈ సినిమా టీవీలో వచ్చినా పెద్దగా చూడాల్సిన సినిమా కాదు. ఇక థియేటర్ కు వెళ్లాల్సిన నెస్సెసిటీ లేనే లేదు. మొహమాటం లేకుండా సినిమాను ఎవాయిడ్ చేయ్యెచ్చు…..

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here