Home Movie News రకుల్ ప్రీత్ సింగ్ దానికి కూడా ఒప్పుకుందా..

రకుల్ ప్రీత్ సింగ్ దానికి కూడా ఒప్పుకుందా..

0
SHARE
rakul and balakrishna | telugu.itsmajja.com

రకుల్ ఇప్పటికే కెరీర్ మొదలుపెట్టి దాదాపు అర దశాబ్దం దాటిపోయింది. ఇన్నేళ్లలో తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరితో నటించింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఇప్పటి వరకు సీనియర్ హీరోల జోలికి మాత్రం ఎప్పుడూ వెళ్ళలేదు రకుల్. ఇప్పుడు అది కూడా జరుగుతుంది. కెరీర్ కొనసాగాలంటే ఇప్పటికీ మడికట్టుకుని కూర్చుంటే సరిపోదు అని అర్థం చేసుకుంది రకుల్ ప్రీత్. అందుకే ఇప్పటి వరకు కుర్ర హీరోలతో మాత్రమే నటిస్తూ వచ్చిన ఈ ముద్దుగుమ్మ సీనియర్ హీరోలతో కూడా రొమాన్స్ చేయడానికి రెడీ అయిపోయింది.

ఈ మధ్య ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో బాలయ్యతో ఆకు చాటు పిందె తడిసే స్టెప్పులు వేసిన రకుల్ ప్రీత్ సింగ్.. ఇప్పుడు సినిమా మొత్తం స్టెప్పులు వేయడానికి సిద్ధమైపోయింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటించబోయే సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా తీసుకున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో నటించడానికి కూడా పెద్దగా అభ్యంతరాలు చెప్పే కారణాలు ఏమీ కనిపించడం లేదు. ఎందుకంటే తెలుగులో రకుల్ కెరీర్ కు చాలా సాయం చేసింది బోయపాటి శ్రీను ఒక్కడే.

ఈయన తెరకెక్కించిన సరైనోడు, జయ జానకి నాయక సినిమాల్లో నటించింది ఈమె. దాంతో ఇప్పుడు బాలకృష్ణ సినిమాలో కూడా రకుల్ ని తీసుకోవాలని ఆలోచిస్తున్నాడు బోయపాటి శ్రీను. ఏప్రిల్ నుంచి ఈ చిత్రం పట్టాలెక్కనుంది. ఇదే ఏడాది బోయపాటి శ్రీను బాలకృష్ణ సినిమా విడుదల కానుంది. సింహా, లెజెండ్ లాంటి సంచలన సినిమాల తర్వాత ఈ కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా కావడంతో అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. మొత్తానికి తన కెరీర్ కాపాడుకోవడం కోసం కుర్ర హీరోల నుంచి సీనియర్ హీరోలతో నటిస్తూ సీనియర్ హీరోయిన్ పోస్ట్ అందుకుంది రకుల్ ప్రీత్ సింగ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here