Home Movie News కనదుర్గమ్మ అశిస్సులతో రవితేజ

కనదుర్గమ్మ అశిస్సులతో రవితేజ

0
SHARE
Ravi Teja's Kanakadurga | telugu.itsmajja.com

రవితేజ కెరీర్ అప్పట్లో మాంచి ఉపు మీదుండేది. కానీ ఆయన చేస్తున్న ప్రయోగాలన్నీ వికటిస్తున్నాయి. రాజా ది గ్రేట్ ఆయనకు మంచి పేరే తీసుకొచ్చింది. కానీ అమర్ అక్బర్ ఆంటోనీ బాగా దెబ్బ కొట్టింది. భారీ డిజాస్టర్ గా నిలిచి కెరీర్ సక్సెస్ లకు బ్రేకులు వేసింది. ఇక ఇప్పుడు ఇన్నోవేటివ్ కథాంశంతో విఐ ఆనంద్ తెరకెక్కిస్తున్న డిస్కోరాజా చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో మళ్లీ సూపర్ ఫాంలోకి వస్తాననే ధీమా వ్యక్తం చేస్తున్నాడు. అయితే దీనికంటే ముందే ఓ సినిమా ఓపెనింగ్ అయి కన్ఫ్యూజన్ లో ఉంది. ఆ సినిమా ఇప్పుడు మెల్లగా పట్టాలెక్కించే ప్రయత్నాలు చేస్తున్నారట.

 

సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రవితేజ హీరోగా ఓ సినిమాచేయాలని ప్లాన్ చేశారు. పూజ కూడా చేశారు. అయితే పట్టాలెక్కే విషయంలోనే అవస్థలు పడుతోంది. తెరి రీమేక్ గా ఈ సినిమా రూపొందిస్తున్నారు. ఈ చిత్రం నిజానికి పవన్ కళ్యాణ్ చేయాల్సింది. కానీ ఆయన జనసేనతో బిజీగా ఉండడంతో రవితేజ దగ్గరికి వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమా నిర్మించనున్నారు. ఈ సినిమాకు కనకదుర్గ అనే టైటిల్ పెట్టనున్నారట. కమర్షియల్ గా రవితేజకు సరిగ్గా సరిపోతుంది. అయితే రభస వంటి ఫ్లాప్ సినిమా తర్వాత సంతోష్ శ్రీనివాస్ ఈ కథను ఎలా మలిచాడన్నది ఇంపార్టెంట్. రవితేజకు కమర్షియల్ గా ఎలాంటి సినిమా ఇస్తాడనేది చూడాల్సిన అంశం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here