Home Movie News విక్రమ్ కొడుకు సినిమా ఆగిపోవడానికి అసలు కారణాలు ఇవే..

విక్రమ్ కొడుకు సినిమా ఆగిపోవడానికి అసలు కారణాలు ఇవే..

0
SHARE
Dhruv Vikram Movie | telugu.itsmajja.com

సినిమా మొత్తం పూర్తయిన తర్వాత మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తుందనుకున్న సమయంలో వర్మ సినిమాను ఆపేశారు దర్శక నిర్మాతలు. అర్జున్ రెడ్డి లాంటి సంచలన సినిమాకు రీమేక్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు బాల. ఇందులో విక్రమ్ తనయుడు ద్రువ్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ఉన్నట్టుండి ఆగిపోవడానికి కారణం దర్శక నిర్మాతలు కాదు అని విక్రమ్ ప్రధాన కారణం అని తెలుస్తోంది.

సినిమా మొత్తం అయిపోయిన తర్వాత ఫస్ట్ కాపీ చూసి విక్రమ్ చాలా నిరుత్సాహపడ్డాడని.. ఇలాంటి సినిమా బయటికి వస్తే తన కొడుకు కెరీర్ నాశనం అయిపోతుందని భయపడ్డట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే ఎంత ఖర్చయినా పర్వాలేదు కానీ తీసిన సినిమా మొత్తం తీసి చెత్తబుట్టలో పడేసి.. మళ్ళీ కొత్తగా తీయాలని విక్రమ్ కోరినట్లు ప్రచారం జరుగుతుంది. రీషూట్ కి డబ్బులు మొత్తం విక్రం పెట్టుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

ఆయన చెప్పడంతోనే చాలా ధైర్యంగా నిర్మాతలు ఈ సినిమాను ఆపేస్తున్నట్లు ట్వీట్ చేశారు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇలా ఒక సినిమా విడుదల వారం రోజుల ముందు దర్శక నిర్మాతలు బాలేదు అని చెప్పడం ఇదే తొలిసారి. మొత్తానికి విడుదలకు ముందే అర్జున్ రెడ్డి పరువు కాపాడారు తమిళ దర్శక నిర్మాతలు. లేదంటే తెలుగులో చరిత్ర సృష్టించిన సినిమా తమిళనాట చరిత్రలో కలిసిపోయింది. మళ్లీ ఇదే సినిమాను కొత్త దర్శకుడు కొత్త నటీనటులతో తెరకెక్కించబోతున్నారు. 2020లో ఈ చిత్రం విడుదల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here