Home Movie News సాయి ధరమ్ రిస్క్ తీసుకుంటున్నాడు…

సాయి ధరమ్ రిస్క్ తీసుకుంటున్నాడు…

0
SHARE
ChitraLahari Teaser Launch | telugu.itsmajja.com

మెగా హీరోల్లో చాలా మంది డైరెక్టర్స్ మెచ్చే వ్యక్తి సాయి ధరమ్ తేజ్. వ్యక్తి గతంగా సాయి ధరమ్ ను బాగా ఇష్ట పడతారు. కానీ సినిమాల పరంగా చాలా మంది ఫ్లాపులు ఇచ్చి కెరీర్ ను డోలాయమానంలో పడేశారు. అసలు ఎలాంటి సినిమా చేయాలనే దాంట్లో క్లారిటీ మిస్ అయ్యాడు సాయి ధరమ్ తేజ్. ఇప్పటివరకు ఫక్తు యాక్షన్ సినిమాలు చేసి చతికిల పడ్డాడు. ఇక ఇప్పుడు కొత్తగా ఉండాలని లవ్, ఎమోషనల్ స్టోరీని ఎంచుకొని కిషోర్ తిరుమల దర్శకత్వంలో చిత్రలహరి సినిమాలో నటించాడు. ఈ సినిమా టీజర్ విడుదలైంది.

 

ఈ టీజర్ కు మంచి మార్కులే పడ్డాయి. టీజర్ కొత్తగా ఉందని… సాయికి కొత్త  సినిమా అవుతుందని అంటున్నారు. అయితే గన్ షాట్ గా హిట్ కొట్టేస్తాడని మాత్రం ఈ టీజర్ తో అంచనా వేయలేకపోతున్నారు. ఎందుకంటే ఈ తరహా సినిమాలు కంటెంట్, ఎంటర్ టైన్ మెంట్, ఎమోషనల్ టచ్.. మంచి క్లైమాక్స్ ఉంటేనే ఆడతాయి. లేకపోతే.. ప్రేక్షకులు మడిచి పాతరేస్తారు. ఏది ఏమైనా సాయి ధరమ్ చేస్తున్న రిస్క్ తో సక్సెస్ సాధిస్తాడా లేదా అన్నది చూడాలి.

 

ఈ సినిమాతో సాయిధ‌ర‌మ్‌ కి మ‌ళ్లీ సుప్రీమ్ డేస్ వస్తాయిని గట్టిగా నమ్ముతున్నారు. అన్నట్టు ఈ చిత్రానికి సునీల్, వెన్నెల కిషోర్ కామెడీ ప్లస్ కానుందట.  దేవిశ్రీ ప్ర‌సాద్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీస్ బ్యానర్లో న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, సి.వి.ఎం(మోహ‌న్‌)  నిర్మిస్తున్నారు. సాయిధ‌ర‌మ్ తేజ్ స‌ర‌స‌న క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌, నివేదా పేతురాజ్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను ఏప్రిల్ 12న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేయడానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here