Home Movie News షాక్ – వినాయక్ కొత్త అవతారం…

షాక్ – వినాయక్ కొత్త అవతారం…

0
SHARE
VV Vinayak

టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో వివి వినాయక్ ఒకరు. కమర్షియల్ ఫార్ములాను మరో రేంజ్ కి తీసుకెళ్లిన దర్శకుడు. అయితే ఈ మధ్య వరస ఫ్లాపులతో కాస్త వెనకబడ్డాడు. హీరోల డేట్స్ కోసం వేచి చూడాల్సిన పరిస్థితికి వచ్చాడు. అయితే ఈ గ్యాప్ లో రియల్ ఎస్టేట్ పై కాన్ సన్ ట్రేట్ చేశాడు. ఆ మధ్య బాలకృష్ణతో ఓ సినిమా చేయాలనుకున్నాడు. కానీ కథ సెట్ కాలేదు. ఇక ఇప్పుడు రవితేజతో ఓసినిమా చేయనున్నాడని వార్తలొస్తున్నాయి. ఇదిలా ఉంటే వివి వినాయక్ హీరోగా ఓసినిమా చేస్తున్నాడనేది టాలీవుడ్ టాక్.

దర్శకుడిగా ఓ రేంజ్ లో ఉన్నప్పుడే వినాయక్ అడపా దడపా సినిమాల్లో గెస్ట్ రోల్స్ రూపంలో స్క్రీన్ ముందు కనిపించే వారు. ఠాగూర్ లో మంచి పాత్రే వేశారు. స్క్రీన్ అనుభవం కూడా ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొనే… ఆయన వయసు, బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా డైరెక్టర్ శంకర్ అసిస్టెంట్ నరసింహారావు దిల్ రాజుకు ఓ కథ చెప్పాడట. కథ తెగ నచ్చడంతో వినాయక్ కు సిఫార్స్ చేశాడట. వినాయక్ కూడా కథ నచ్చి సినిమా చేద్దాం అని అన్నారట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇచ్చేందుకు దిల్ రాజు రెడీ అయ్యాడని అంటున్నారు.

వినాయక్ హీరో ఏంటని డౌటానుమానం వచ్చినప్పటికీ… అక్కడ నిర్మాత దిల్ రాజు కాబట్టి… అందరూ ఆలోచిస్తున్నారట. ఏదో విషయం లేనిదే దిల్ రాజు ఒప్పుకోడు కదా అని అంటున్నారు. చూడాలి… ఈ వార్తలోని నిజానిజాలేంటో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వెయిట్ చేద్దాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here