Home Reviews సూర్యకాంతం మూవీ రివ్యూ

సూర్యకాంతం మూవీ రివ్యూ

0
SHARE
Suryakantam Movie Review | telugu.itsmajja.com

Rating : 2/5

వ‌రుణ్ తేజ్ స‌మ‌ర్ప‌ణ‌లో నిర్వాణ సినిమాస్ బ్యాన‌ర్‌పై నిహారిక కొణిదెల‌, రాహుల్ విజ‌య్ జంట‌గా న‌టించిన చిత్రం `సూర్య‌కాంతం`. ప్ర‌ణీత్ బ్ర‌హ్మాండ‌ప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో సందీప్ ఎర్రంరెడ్డి, సుజ‌న్ ఎర‌బోలు, రామ్ న‌రేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. హీరో హీరోయిన్ కు ఇప్పటివరకు హిట్ లేదు. మరి ఈ సినిమాతో హిట్ కొట్టే ఛాన్స్ ఉందొ లేదో చూద్దాం.

కథేంటంటే… పూజకు అభి కి పెళ్లి కుదుర్చుతారు. ఆ టైం లో సూర్యకాంతంతో గడిపిన రోజులు షేర్ చేసుకుంటాడు అభి. తనను కాంతం వదిలిపెట్టి పోతుంది. దీంతో పెళ్లికి ఒప్పుకుంటాడు. అంత సెట్ అయ్యిందనుకుంటున్న టైం లో కాంతం మళ్ళీ తన లైఫ్ లోకి వస్తుంది. ఇటు పూజ అటు కాంతం మధ్యలో ఇరుక్కుంటాడు. చివరికి ఎవరి ప్రేమను ఎవరు దక్కించుకున్నారనేది తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే.

సమీక్ష…
కాంతం వెంట అభి పడే సన్నివేశాలు బోరింగ్ గా ఉన్నాయి. ఆమెను ఇంప్రెస్ చేయడం చాలా సినిమాల్లో ఉన్నవే.
సుహాసిని నిహారిక తల్లిగా నటించింది. కూతురికి పెళ్లి చేయాలని అనుకుంటుంది. కానీ నిహారిక ఒప్పుకోదు. ఆతర్వాత అభి సూర్యకాంతం గురించి ఆమె అమ్మ గిరించి తెలుసుకుంటాడు.. ఈ సీన్స్ సాదా సీదాగా సాగుతుంటాయి. శివాజీరాజా హీరో తండ్రి గా నటించాడు
నిహారిక క్యారెక్టర్ సునామి లాంటిది. ఎప్పుడు ఎలా ఉంటుందో అర్థం కాదు. తనకు నచ్చినట్టుగా బతుకుతుంది. ప్రేక్షకులకు కూడా అర్థం కాదు. ఓ దశలో సూర్యకాంతం తల్లి చనిపోతుంది. దీనితో ఆమె బాధ్యతలు అభి తీసుకుంటాడు. ఈ సీన్స్ లో ఎమోషన్ పండలేదు. ఆర్టిఫిషియల్ గా నడుస్తుంది. కొద్దిలో కొద్దీ సత్య నవ్వించాడు. నిహారిక సత్యను కొట్టే సీన్ బాగుంది.

సినిమాలో కొత్త సీన్ అనిపించేవి ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. రెగ్యులర్ స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్. డైరెక్టర్ బాగా అప్డేట్ అవ్వాలి. కొత్తగా రాసుకోవడం లో విఫలమయ్యాడు. వరుణ్ తేజ్ ఈ సినిమాకు సమర్పకుడిగా ఎందుకున్నాడో అర్థం కాదు. అంతగా ఏం నచ్చిందో మరి. స్లో నరేషన్ ప్రేక్షకులకు పెద్ద పరీక్షే. యూత్ ని టార్గెట్ చేసిన ఈ సినిమా అసలు ట్రెండీ గా లేదు. యూత్ బాగా అప్డేట్ అయ్యారు.. కానీ ఈ సినిమా యూనిట్ మాత్రం అవ్వలేదు. క్లిమాక్స్ లో ఏదైనా మ్యాజిక్ జరుగుతుంది అనుకుంటే… సప్పగా ముగించాడు.
టెక్నీకల్ గా కెమెరా వర్క్ మ్యూజిక్ బాగుంది. నిర్మాతలు మేకింగ్ కి ఖర్చుపెట్టారు. కానీ కంటెంట్ విషయం లో పట్టించుకోలేదు.

చివరగా … సూర్యకాంతం బోరింగ్ గా సాగే త్రిముఖ ప్రేమ కథా చిత్రం.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here