Home Movie News స్టార్ హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేసిన దర్శకుడు తేజ..

స్టార్ హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేసిన దర్శకుడు తేజ..

0
SHARE
Teja | telugu.itsmajja.com

సినిమాలు తక్కువగా ఉన్నా ఎప్పుడు వివాదాలు మాత్రం ఎక్కువగానే ఉండేలా చూసుకుంటాడు దర్శకుడు తేజ. ఈ మధ్య సీత సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈయన. బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ జంటగా వచ్చిన సీత డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మరోసారి స్టార్ హీరోలపై విరుచుకుపడ్డాడు తేజ. ముందు నుంచి కూడా ఆయనకు స్టార్ హీరోలు అంటే పెద్దగా సదభిప్రాయం లేదు.

ఇండస్ట్రీలో మహేష్ బాబు తప్ప మరో హీరో కూడా తనకు పెద్దగా నచ్చడు అని ఓపెన్ గానే చెబుతున్నాడు ఈ దర్శకుడు. ఇక ఇప్పుడు మరోసారి తన నోటి దురుసు చూపించాడు తేజ. స్టార్ హీరోలతో సినిమాలు చేయాలంటే తనకు నచ్చదని.. వాళ్లతో సినిమాలు చేయడానికి మన ఈగో చంపుకోవాల్సి వస్తోందని చెబుతున్నాడు తేజ. అందుకే ఎప్పుడూ కొత్త హీరోలతో.. ఇమేజ్ లేని వాళ్లతోనే సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తుంటానని చెబుతున్నాడు ఈ దర్శకుడు.

ఒకవేళ నిజంగానే కథ నచ్చి స్టార్ హీరోలతో సినిమాలు చేయాల్సి వస్తే వాళ్ళ కోసం ఆ కథ మార్చాల్సి వస్తుందని.. ఆరు పాటలు, నాలుగు ఫైట్లు, 5 కామెడీ సీన్లు లేకపోతే స్టార్ హీరోలు ఒప్పుకోరని సంచలన కామెంట్స్ చేశాడు ఈయన. వాళ్ల కోసం తాను రాసుకున్న కథను మార్చుకొని వాళ్లకు నచ్చినట్లు చేయాల్సి వస్తుందని.. అందుకే స్టార్ హీరోలతో సినిమా అంటే తనకు అసలు పడదు అంటున్నాడు తేజ. దాని కంటే తాను రాసుకున్న కథకు కొత్త వాళ్ళని ఎంచుకుని తీసుకోవడంలోనే సంతృప్తి ఉందంటున్నాడు ఈయన. నేనే రాజు నేనే మంత్రి సినిమాతో హిట్ కొట్టిన తేజ.. సీత సినిమాతో మరో డిజాస్టర్ ఇచ్చాడు. ఇప్పుడు ఈయన ఫామ్ లోకి రావడానికి నానా తంటాలు పడుతున్నాడు. ఈ సమయంలో స్టార్ హీరోలపై కామెంట్స్ చేసి మరోసారి వార్తల్లో నిలిచాడు. ఆ మధ్య ఇలా ఈగో చంపుకోవాల్సి వస్తోందనే బాలకృష్ణ, వెంకటేష్ సినిమాలు కూడా వదిలేసుకున్నాడు తేజ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here