Home Movie News మజిలీకి అదే పెద్ద మైనస్

మజిలీకి అదే పెద్ద మైనస్

0
SHARE
Mahili first look | telugu.itsmajja.com

నాగచైతన్య, సమంత జంటగా నటిస్తున్న చిత్రం మజిలీ. శివ నిర్వాణ దర్శకుడు. పెళ్లైన తర్వాత చైతు, సామ్ ఇద్దరూ కలిసి నటిస్తుండడంతో మజిలీపై చాలా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా ట్రైలర్ కు కూడా మంచి అప్లాజ్ వచ్చింది. విభిన్నమైన ఫ్యామిలీ డ్రామాగా ప్రశంసలు అందుకుంది. ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అవుతుందంటున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ గురించే అందరూ భయపడుతున్నారు. ఏప్రిల్ 5న ఈ సినిమా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కానీ ఈ డేట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో సరైంది కాదంటున్నారు.

 

తెలంగాణలో పార్లమెంట్ కి, ఆంధ్రప్రదేశ్ లో ప్లార్లమెంట్ తో పాటు, అసెంబ్లీ ఎన్నికల నగారా మోగిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 11న ఒకే విడతలో ఈ ఎన్నిలకు జరగనున్నాయి. నువ్వా నేనా అన్నట్టుగా ఈ ఎన్నికలు ఉంటాయి. అంతా ఎన్నికల సందడిలో మునిగిపోయారు. ఏ ఇద్దరు కలిసినా ఎన్నికల గురించే మాట్లాడుకుంటున్నారు. సినిమా మూడ్ లో ప్రస్తుతం జనాలు లేరనే చెప్పాలి. ఎలక్షన్స్ కు ఓ వారం ముందుగా మజిలీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. ప్రేక్షకులు ఎన్నికలతో బిజీ బిజీగా ఉండే సమయంలో థియేటర్లకు జనాలు వచ్చేది అనుమానమే. అందునా ఆంధ్రప్రదేశ్ లో అస్సలు వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. థియేటర్లకు జనాల్ని తీసుకు రావడం చాలా కష్టమే. అందునా… కమర్షియల్ ఎలిమెంట్స్ పెద్దగా లేని సినిమా. సినిమా బాగుంటే తప్ప రెండో రోజు నుంచి జనాలు కదలని కంటెంట్ మజిలీది. అలాంటి సమయంలో మజిలీ నిర్మాతలు రిస్క్ చేస్తున్నారనే చెప్పొచ్చు. మరి ఎన్నికల్ని దృష్ణిలో ఉంచుకొని పోస్ట్ పోన్ చేస్తారా లేక.. ఏదేమైనా ఏప్రిల్ 5నే రిలీజ్ చేస్తారా అనేది చూడాలి.

 

నాగ‌చైత‌న్య‌తో పాటు ఈ చిత్రంలో రెండో హీరోయిన్ గా దివ్యాంశ కౌశిక్ నటిస్తోంది. క్రికెట్ నేపథ్యంలో సాగే ప్రేమ కథ ఇది.  దేర్ ఈజ్ ల‌వ్.. దేర్ ఈజ్ పెయిన్ అనే ట్యాగ్ లైన్ తో వ‌స్తున్న ఈ చిత్రం వైజాగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కిస్తున్నారు ద‌ర్శ‌కుడు శివ‌నిర్వాన‌. నిన్నుకోరి త‌ర్వాత శివ‌నిర్వాన తెర‌కెక్కిస్తున్న రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ ఈ మ‌జిలి. రావు ర‌మేష్, పోసాని కృష్ణ‌ముర‌ళి, సుబ్బ‌రాజ్ ఈ చిత్రంలో కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. గోపీసుంద‌ర్ సంగీతం అందిస్తుండ‌గా.. విష్ణు వ‌ర్మ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. షైన్ స్క్రీన్ బ్యాన‌ర్ పై సాహు గ‌ర‌పాటి, హ‌రీష్ పెద్ది మ‌జిలి సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఎప్రిల్ 5న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here