Home Reviews వినయ విధేయ రామ మూవీ రివ్యూ

వినయ విధేయ రామ మూవీ రివ్యూ

0
SHARE
Vinaya Vidheya Rama Movie Review | telugu.itsmajja.com

Rating : 2/5

రంగస్థలం సినిమాతో 2018లో ఉత్తమ నటుడిగా ప్రశంసలందుకున్నాడు చరణ్. ఆ సినిమాతో నటుడిగా ఓ మెట్టు ఎదిగాడు చరణ్. అలాంటి చరణ్ ఓ మాస్ సినిమా చేయాలనుకున్నాడు. అందుకే బోయపాటి శ్రీనును దర్శకుడిగా ఎంచుకున్నాడు. డివివి దానయ్య నిర్మాత. కైరా ఆద్వాని హీరోయిన్. దేవిశ్రీ మ్యూజిక్. వివేక్ ఒబేరాయ్ విలన్. ప్రశాంత్, స్నేహ, ఆర్యన్ రాజేష్ కీలక పాత్రల్లో కనిపించారు. ట్రైలర్ తర్వాత భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుందో లేదో చూద్దాం.

 

కథేంటంటే : ఓ నలుగురు అనాథ పిల్లలు కలిసి పెరుగుతుంటారు. జీవితం మీద విరక్తితో చనిపోదామనుకుంటున్న సమయంలో ఓ చిన్న బాబు దొరుకుతాడు. అతనివల్లే వారి ప్రాణాలు నిలిచాయని భావిస్తారు. వారంతా కలిసి మెలసి పెరుగుతారు. అన్న(ప్రశాంత్) ఎలక్షన్ ఆఫీసర్ గా పనిచేస్తుంటాడు. తమ్ముడు రామ (చరణ్) ఏం చేయకపోయినా ఫ్యామిలీకి ఎలాంటి సమస్య వచ్చినా కాపాడుతుంటాడు. అన్న బీహార్ లో పనిచేస్తున్న సమయంలో ఆ ఏరియా డాన్ రాజా సింగ్ (వివేక్ ఒబేరాయ్) తో ఓ సమస్య వస్తుంది. అది పెద్దది అవుతుంది. రాజా సింగ్  నుంచి రామ ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడన్నదే అసలు కథ.

 

సమీక్ష

దర్శకుడు పెద్దగా కథ మీద కాన్ సన్ ట్రేట్ చేయలేదు. పాత కాలపు చింతకాయ పచ్చడి కథను వండేందుకు ట్రై చేశాడు. అది కూడా రొడ్డ కొట్టుడు సన్నివేశాలతో తీశాడు. ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ కంటే మైనస్ పాయింట్లే ఎక్కువగా కనిపిస్తాయి. ఈ సినిమా కథ కోసం పాపం చరణ్ బాగానే కష్టపడ్డాడు. ఫిజికల్ గా ఫిట్ గా మారాడు. యాక్షన్ పార్టుల కోసం బాగా కష్టపడ్డాడు. కానీ పొంతన లేని సీన్స్, లాజిక్స్ లేని సీన్స్ తో విసుగెత్తించాడు బోయపాటి. కనీసం మినిమం కథ కూడా లేకుండా రాసుకున్నాడు. ఈ తరహా కథ, కథనంను రామ్ చరణ్ అండ్ టీం ఎలా ఒప్పుకుందా అనే అనుమానం వస్తుంది. ఎమోషనల్ గా కూడా కనెక్ట్ అయ్యేలా లేదు సినిమా. గతంలో శక్తి, దమ్ము సినిమాల్ని చూసిన విధంగా అనిపిస్తుంది. సినిమాలో హీరో నరికేసిన తలకాయల్ని గద్దలు ఎత్తుకెళ్లడం…. వాటి కోసం వివేక్ ఒబేరాయ్ పరుగెత్తే సీన్ చూస్తే తెలుగు సినిమా స్థాయి ఇంత దిగజారిందా అనిపిస్తుంది. వివేక్ తో పాము సీన్ లో గ్రాఫిక్స్ నీచాతి నీచం.

 

కైరా అద్వాని క్యారెక్టర్ ఎందుకు పెట్టారో అర్తం కాదు. ప్రశాంత్ తో పాటు ఇద్దరు తమ్ముళ్లు ఆర్యన్ రాజేష్, రవి ఎందుకు ఆయన వెంటే ఉంటారో అర్థం కాదు. ప్రశాంత్ ఏ ఊరు ట్రాన్సఫర్ అయితే ఆ ఊరు వెళ్తుంటారు. అసలు కథ బీహార్లో జరుగుతుందా, హైదరాబాద్ లో జరుగుతుందా, వైజాగ్ లో జరుగుతుందో అర్థం కాదు. నేటివిటీని బాగా మిస్ అయ్యాడు దర్శకుడు. ఈ సినిమా లో కంటెంట్ లేకపోవడంతో పాపం  దేవిశ్రీ ప్రసాద్ కూడా ఏం చేయలేకపోయాడు. కేవలం కెమెరా వర్క్ మాత్రమే బాగుంది. పాపం నిర్మాతతో బాగా డబ్బులు కక్కించాడు దర్శకుడు. కనీసం అభిమానుల్ని శాటిస్ ఫై చేస్తాడనుకుంటే అది కూడా లేదు. ఏయిర్ పోర్ట్ నుంచి దూకి ట్రైన్ మీద ఎక్కి గుర్రం మీద వెళ్లే సీన్ బోయపాటి నిర్లక్ష్యానికి నిదర్శనం.

 

రామ్ చరణ్ వరకు బాగా చేశాడు. కానీ ఏం లాభం విషయం లేని సినిమాలో ఎంత చేస్తే ఏం లాభం. రంగస్థలం సినిమాతో ఎంతగా చరణ్ ను పొగిడారో అంతగా ఈ సినిమా తగ్గించింది. ఫస్టాఫ్ లో వచ్చే పెళ్లి చూపుల సీన్ నవ్వించింది. పృథ్వీ ఓ సీన్ లో నవ్వించాడు. పందెం పరశురామ్ రామ్ చరణ్ మధ్య వచ్చే సీన్ పరవాలేదనిపిస్తుంది. ఇవి తప్ప సినిమాలో ఏం లేదు.  ఈ తరహా కథలు గతంలో  చాలా వచ్చాయి. ఆల్రెడీ చూసేశాం. చాలా సినిమాలు ఫ్లాప్ కూడా అయ్యాయి. మరి అలాంటప్పుడు ఈ తరహా కథనే ఎందుకు ఎంచుకున్నారో అర్థం కాదు. సాధారణంగా బోయపాటి సినిమాల్లో డైలాగ్స్ కూడా బాగుంటాయి. కానీ ఈ సారి డైలాగ్ రైటర్ రత్నం కూడా చేతులెత్తేశాడు. డైలాగ్స్ పెద్దగా ఎక్కలేదు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ పవర్ కనిపించలేదు.

 

ఓవరాల్ గా దర్శకుడు బోయపాటి బాగా డిసప్పాయింట్ చేశాడు. అక్కడక్కడ కొన్నిసీన్స్ మెప్పించినా ఓవరాల్ గా మంచి కథ, బలమైన కథనం రాసుకోవడంలో విఫలమయ్యాడు. రాంచరణ్ బాగా  కష్టపడ్డప్పటికీ వృథా గా పోయింది. పాత కాలపు పచ్చడి కథను ప్రేక్షకులకు ఎక్కించే ప్రయత్నంచేశాడు. బోయపాటి వేటుకు గాయపడిన కొణిదెల అని పాడుకోడమే.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here