Home Movie News సునీల్ ఫ్యూచర్ ఏంటి… హీరోగా చేయడా….

సునీల్ ఫ్యూచర్ ఏంటి… హీరోగా చేయడా….

0
SHARE
sunil Interview | telugu.itsmajja.com

సునీల్ ఒకప్పుడు సూపర్ ఫాంలో ఉన్న కమెడియన్. బ్రహ్మానందం తర్వాత సునీల్ లేకుండా సినిమా ఉండేదే కాదు. అంత బిజీ కమెడియన్. సడన్ గా అందాల రాముడుతో హీరోగా మారాడు. ఆ సినిమా సక్సెస్ అయ్యింది. ఆ తర్వాత మర్యాద రామన్న సూపర్ హిట్ అయ్యింది. దీంతో ఫుల్ టైం హీరోగా మారి దెబ్బతిన్నాడు. ఆ తర్వాత హీరోగా చేసిన సినిమాలు ఒక్కొక్కటిగా ఫ్లాప్ అయ్యాయి. దీంతో మళ్లీ తన పాత బాటలోకే వచ్చేశాడు. అయితే ఇప్పుడు హీరోగా మళ్లీ చేస్తాడా లేదా అన్నదానికి సమాధానం కూడా సునీల్ నుంచి వచ్చేసింది.

 

సునీల్ అరవింద సమేత చిత్రంలో ఓ ఇంపార్టెంట్ పాత్రలో నటించాడు. ఆ సినిమా విజయం సాధించింది. ఆ తర్వాత నుంచి వరుసగా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ చేస్తూ వస్తున్నాడు. తాజాగా చిత్రలహరి చిత్రంలో మంచి పాత్రలో కనిపించాడు. అంతే కాదు నవ్వించాడు కూడా. దీంతో సునీల్ వైపు పాజిటివ్ వైబ్ వచ్చింది. అల్లు అర్జున్, త్రివిక్రమ్ తర్వాతి చిత్రంలో కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. దీంతో పాటు చిరంజీవి, కొరటాల చిత్రంలోనూ సినిమా అంతా ఉండేలా ఇంపార్టెంట్ రోల్ లో కనిపిస్తున్నాడట. ఇలాంటి టైంలో హీరోగా చేసి చేయి కాల్చుకోవడం కరెక్ట్ కాదని డిసైడ్ అయ్యాడట. అయితే గతంలో తాను హీరోగా నటిస్తున్న టైంలో ఇద్దరు నిర్మాతల దగ్గర అడ్వాన్స్ తీసుకున్నానని… ఆ ఇద్దరు నిర్మాతలకు మాత్రమే హీరోగా సినిమా చేస్తానని అంటున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here