Home Movie News సప్తగిరి సినిమాను ఏం చూసి కొన్నారు….

సప్తగిరి సినిమాను ఏం చూసి కొన్నారు….

0
SHARE
Vajra Kavachadhara Govinda | telugu.itsmajja.com

సప్తగిరి హీరోగా ఆ మధ్య సినిమాలు చేసినా పూర్తిగా సక్సెస్ కాలేకపోయాడు. కమర్షియల్ గా సక్సెస్ కాకపోవడంతో నిరాశ చెందాడు. బహిరంగంగా స్డేజ్ ల మీదే రివ్యూల్ని ఏకి పారేశాడు. ఏది ఏమైనా… సప్తగిరితో సినిమాలు చేసేందుకు నిర్మాతలు ఇంకా ముందుకు వస్తుండండం విశేషం. అలా రూపొందించిందే వజ్రకవచధర గోవింద… అరుణ్ పవార్ ఈ సినిమాకు దర్శకుడు. ఈ చిత్రం టీజర్ ఆ మధ్య విడుదలైంది. ఇంట్రస్టింగ్ గానే ఉంది. ఈ సినిమా ట్రైలర్ తర్వాత సినిమా బిజినెస్ కూడా పూర్తవడంతో అందరూ షాక్ అయ్యారు. పెద్ద సినిమాల బిజినెస్ లు అవ్వని టైంలో సప్దగిరి లాంటి కమెడియన్ కమ్ హీరో సినిమా బిజినెస్ అవ్వడంతో చర్చకు దారితీసింది.

ఈచిత్రం రషెస్ చూసి ప్రముఖ సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ బ్రహ్మయ్య సినిమాను ఔట్ రైట్ గా తీసుకున్నాడు. ఈ సినిమా థియేట్రికల్ హక్కుల్ని సొంతం చేసుకోవడంతో పెట్టిన డబ్బులు వచ్చేశాయి. ఇక శాటిలైట్, డిజిటల్, ఓవర్సీస్, ఇతర భాషా హక్కులు ఉండనే ఉన్నాయి. ఈ రకంగా సప్తగిరి సినిమా పూర్తి సేఫ్ జోన్ లోకి వెళ్లినట్టే.

సప్దగిరి మళ్లీ మంచి రోజులు వచ్చినట్టే అని అంటున్నారు. ఇందులో మెయిన్ గా హీరోయిజం కాకుండా కామెడీ బాగా చేశానంటున్నాడు. ఈ సినిమా విడుదల తర్వాత సూపర్ హిట్ కొడితే సప్దగిరి మార్కెట్ మరింత పెరిగినట్టే. టీజర్ లో చూపించిన క్యూరియాసిటీ, సినిమా లో ఉంటుందా లేదా అన్నది చూడాల్సిన విషయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here