Home Movie News సంక్రాంతి సినిమాల భ‌విష్య‌త్తు ఎలా ఉండ‌బోతుందో..?

సంక్రాంతి సినిమాల భ‌విష్య‌త్తు ఎలా ఉండ‌బోతుందో..?

0
SHARE
vinaya vidheya rama ntr biopic f2 peta movie | telugu.itsmajja.com

మరో రెండు రోజుల్లో సంక్రాంతి సినిమాలు రానున్నాయి. జనవరి 9 నుంచి 12 వరకు వరుసగా నాలుగు రోజుల్లో నాలుగు భారీ సినిమాలు విడుదల అవుతున్నాయి. ఏ సినిమాను తక్కువగా అంచనా వేయడానికి లేదు. అన్ని సినిమాల్లోనూ స్టార్స్ ఉన్నారు.. అన్నీ భారీ సినిమాలే. ఇప్పుడు ఈ సినిమా సెన్సార్ రిపోర్టులను బట్టి చూస్తుంటే ఏది విజయం సాధిస్తుందనేది ఇప్పుడు చెప్ప‌డం క‌ష్టంగా మారుతుంది. అన్నింటినీ పాజిటివ్ రిపోర్ట్స్ వ‌స్తున్నాయి. ఎన్టీఆర్ బయోపిక్ సెన్సార్ రిపోర్ట్ అద్భుతంగా వచ్చింది.. సినిమా ఎమోషనల్ గా సాగుతుందని.. క్రిష్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడంటున్నారు సెన్సార్ సభ్యులు.

 

అంతేకాకుండా సినిమాల్లో ఎన్టీఆర్ ఎదిగిన విధానాన్ని చాలా బాగా ఆవిష్కరించారని తెలుస్తోంది. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడానికి ప్రేరేపించిన దివిసీమ ఎపిసోడ్ సినిమాకు ప్రాణంగా నిలబడిపోతుందని ప్ర‌చారం జ‌రుగుతుంది. ఆ తర్వాత రోజు రానున్న పేట సినిమాకు కూడా సెన్సార్ రిపోర్ట్ బాగానే వచ్చింది. కాకపోతే తమిళ వాసనలు ఉండడం.. తక్కువ థియేటర్లలో రానుండ‌టం ఈ చిత్రానికి మైన‌స్. రామ్ చరణ్ వినయ విధేయ రామ‌ సినిమాకు సెన్సార్ రిపోర్ట్ కూడా పాజిటివ్ గా ఉంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రాబోతుంది. బోయపాటి శ్రీను మాస్ ఇమేజ్ కు తోడు రామ్ చరణ్ మార్కెట్ వినయ విధేయ రామ‌కు శ్రీరామరక్ష.

 

ఇక ఎఫ్2 సినిమా కూడా మంచి అంచనాలతోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా సెన్సార్ రిపోర్ట్ పాజిటివ్ గానే వచ్చింది. సినిమాలో కొత్త కథ లేకపోయినా కూడా ఫస్ట్ సీన్ నుంచి  చివరి వరకు నవ్వించడమే లక్ష్యంగా అనిల్ రావిపూడి ముందుకు వెళ్ళాడని తెలుస్తోంది. మొత్తానికి సంక్రాంతి సినిమాలన్ని సెన్సార్ రిపోర్ట్ బట్టి చూస్తుంటే బాగానే ఉన్నాయని తెలుస్తుంది. మరి రేపు థియేటర్లలోకి వచ్చిన తర్వాత ప్రేక్షకులు ఎలాంటి తీర్పు ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here