Home Movie News జెర్సీ అమ్మాయి నెట్టుకొస్తుందా…

జెర్సీ అమ్మాయి నెట్టుకొస్తుందా…

0
SHARE
Shraddha Srinath Photos | telugu.itsmajja.com

నాని సినిమా అంటే పేరున్న టాప్ హీరోయిన్స్ కనిపిస్తుంటారు. కానీ ఈసారి నాని మనకు తెలియని ఓ హీరోయిన్ ను తీసుకొచ్చాడు. ఆ అమ్మాయే శ్రద్ధా శ్రీనాథ్. నిజానికి ఈ అమ్మాయి… కన్నడలో మంచి హీరోయిన్. ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఎక్కువ. కన్నడలో యు టర్న్ సినిమాతో పాపులర్ అయ్యింది. ఆ తర్వాత బిజీ హీరోయిన్ గా పలు భాషల్లో నటిస్తోంది. తాజాగా నాని జెర్సీ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమా ట్రైలర్లో చూసినప్పుడు హీరోయిన్ ను చూసి… ఇంకా ఎవ్వరూ దొరకలేదా అనుకున్నారంతా… కానీ …

శ్రద్ధా శ్రీనాథ్ చూడటానికి పెద్ద అందగత్తె కాదు. కానీ పెర్ ఫార్మెన్స్ పరంగా శ్రద్ధా మార్కులు కొట్టేస్తుందంటున్నారు. లేకపోతే నాని శ్రద్ధాను హీరోయిన్ గా యాక్సెప్ట్ చేయడు కదా అనేది చిత్ర యూనిట్ చెప్పే మాట. ఇందులో రెండు పాత్రల్లో కనిపించబోతోందట. యంగ్ ఏజ్ లవ్ స్టోరీ, కొడుకుకు తల్లిగా రెండు పాత్రల్లో నటిస్తోందట.  తల్లి పాత్రలో చేయడం ఆమెకు కష్టంగా అనిపించిందట. అందులో చాలా ఎమోషన్స్ ఉన్నాయంటోంది శ్రద్ధా శ్రీనాథ్.

నానితో సినిమా చేసిన తర్వాత జర్సీ సినిమా కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా శ్రద్ధా పెర్ ఫార్మెన్స్ ని కూడా చూసేందుకు వెయిట్ చేస్తున్నారట. శ్రద్ధా చూడటానికి ఫ్యామిలీ టైప్ లా కనిపిస్తున్నా… గ్లామర్ పాత్రలకు కూడా సై అంటోంది. చూడాలి శ్రద్ధా లైఫ్ టాలీవుడ్ లో ఎలా ఉంటుందో….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here